ఖరీదైన విమానంలో పక్క ప్రయాణికుడు గంటపాటు ఆ పని.. మహిళా సీఈఓ దావా
న్యూయార్క్ నుండి మిలన్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తన పక్కనే ఉన్న ప్రయాణికుడు గంటపాటు హస్తప్రయోగం చేశాడని ఒక ఫ్యాషన్ వ్యాపారవేత్త ఎయిర్‌లైన్స్‌పై దావా వేశారు.
By: Tupaki Desk | 31 March 2025 3:30 PMన్యూయార్క్ నుండి మిలన్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తన పక్కనే ఉన్న ప్రయాణికుడు గంటపాటు హస్తప్రయోగం చేశాడని ఒక ఫ్యాషన్ వ్యాపారవేత్త ఎయిర్‌లైన్స్‌పై దావా వేశారు. ఈ ఘటనపై విమాన సిబ్బంది స్పందించడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. న్యూయార్క్ పోస్ట్ ఈ వార్తను ప్రచురించింది.
నీల్ ఎల్షెరిఫ్ అనే మహిళా సీఈఓ, మెలా అనే లగ్జరీ వీగన్ లెదర్ బ్రాండ్‌తో సహా మూడు కంపెనీలకు అధిపతి. ఆమె మే 27న న్యూయార్క్ నుండి మిలన్‌కు ప్రయాణిస్తుండగా తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు గమనించారు. బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన దావా ప్రకారం.. "జాన్ డో"గా పేర్కొనబడిన ఆ వ్యక్తి అనేక గ్లాసుల షాంపైన్ తాగిన తర్వాత తన ప్యాంటుపై నుండి తనను తాను తాకడం ప్రారంభించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది..
ప్రీమియం ఎకానమీ సీటు కోసం $3,000 (సుమారు ₹2.5 లక్షలు) చెల్లించిన ఎల్షెరిఫ్ ఆ వ్యక్తి దాదాపు గంటపాటు అలా చేస్తూ ఉండటంతో భయపడిపోయారు. ఈ సమయంలో విమాన సిబ్బంది ఎవరూ క్యాబిన్ గుండా వెళ్లలేదని దావాలో పేర్కొన్నారు.
ఎల్షెరిఫ్ ఈ విషయాన్ని ఫ్లైట్ అటెండెంట్‌కు తెలియజేసి సహాయం ఆశించారు. అయితే ఆమె కోచ్ క్లాస్‌కు మారడం తప్ప నిజంగా చేయగలిగేది ఏమీ లేదు" అని బదులిచ్చారట... అంతేకాకుండా ఆ ఫ్లైట్ అటెండెంట్ మరింత నిర్లక్ష్యంగా స్పందిస్తూ "మగవారు అలాంటి పనులు చేస్తూనే ఉంటారు" అని తన స్వంత భర్త కూడా ఇలాగే ప్రవర్తిస్తాడని చెప్పడం ఆమెను షాక్‌కు గురిచేసింది.
ఈ ఘటనపై చర్య తీసుకోనందుకు ఎల్షెరిఫ్ ఎయిర్‌లైన్స్ పై ఆ మహిళా సీఈవో దావా వేశారు. సిబ్బంది ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు. తాను అరబ్ మహిళ కావడంతో తన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించలేదని.. వివక్ష చూపారని ఆమె ఆరోపించారు.
ఈ దావాలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌పై నిర్లక్ష్యం.. మానసిక వేదన కలిగించినందుకు ఆరోపణలు చేశారు. దీనిపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి స్పందిస్తూ "అమెరికన్‌తో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ సానుకూల అనుభవాన్ని అందించడానికి మేము కృషి చేస్తాము. మేము ఫిర్యాదులోని ఆరోపణలను పరిశీలిస్తున్నాము" అని తెలిపారు. ప్రస్తుతం కోర్టు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది వేచిచూడాలి.