Begin typing your search above and press return to search.

200 మంది పిల్లలకు తండ్రి... 7 అడుగుల ఈ బానిస గురించి తెలుసా?

ఇందులో భాగంగా... ఇతడి కారణంగా పుట్టే పిల్లలు బలంగా పుడతారని, అన్ని పనులూ చేస్తారని యజమానులు నమ్మేవారంట

By:  Tupaki Desk   |   29 March 2024 3:52 AM GMT
200 మంది పిల్లలకు తండ్రి... 7 అడుగుల ఈ బానిస గురించి తెలుసా?
X

ఈ భూ ప్రపంచం మీద ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సుమారు 200 మంది పిల్లకు తండ్రి అవ్వడం సాధ్యమేనా? కారణాలు ఏదైనా.. అది అసలు కార్యరూపం దాలే కార్యక్రమమేనా? సాధారణ పౌరుడికి అది సాధ్యం కాకపోవచ్చు కానీ... బానిసగా ఉన్న వ్యక్తికి మాత్రం అది సాధ్యం అయ్యింది అనే కంటే... అతనికున్న పర్సనాలిటీ వల్ల తప్పలేదు అనడం సబబు! ఈ ఘటన బ్రెజిల్ లో జరిగింది.. దీంతో ఈ బాహుబలి గురించిన చర్చ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... 19వ శతాబ్దంలో బ్రెజిల్ లో బానిస వ్యాపారం విపరీతంగా జరిగేది. మానవత్వం అనే మాటకు ఏమాత్రం చోటివ్వని ఈ వ్యాపారంలో.. సాటి మనుషులన్న దయకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, అసలు ఆ ప్రస్థావనే రాకుండా.. మనుషులను అమ్మడం, కొనడం చేసేవారు. అనంతరం.. వారిని వ్యవసాయానికి, ఇళ్లల్లో పనికి వినియోగించుకునేవారు. మరికొంతమంది వ్యక్తిగత పనులకు కూడా వాడేసేవారని చెబుతారు!

ఈ క్రమంలోనే సుమారు 7 అడుగుల పొడవు, నల్లని శరీరఛాయ, కండలు తిరిగిన బాడీ కలిగి ఉన్న పటా సెకా అనే వ్యక్తి కూడా బ్రెజిల్ బానిసల్లో ఒకరిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇతడి శరీర దారుఢ్యానికి ఆశ్చర్యపోయిన అనేకమంది బానిసల యజమానులు... తమ కింద పనిచేసే నల్లజాతి యువతులకు అతనితో బలవంతంగా సంపర్కం చేయించేవారంట. అందుకు వారికి ఉండే కారణాలు మరింత దారుణంగా ఉన్నాయి.

ఇందులో భాగంగా... ఇతడి కారణంగా పుట్టే పిల్లలు బలంగా పుడతారని, అన్ని పనులూ చేస్తారని యజమానులు నమ్మేవారంట. దీంతో.. ఈ సెకా ను బానిసగా పొందిన యజమానికి ఇదొక సైడ్ ఇన్ కం గా మారిందంట. దీంతో అతడిని మాగ్జిమం ఈ పనులకే ఉపయోగించేవాడంట అతడి యజమాని! ఇలా అనేకమంది యువతులతో, మహిళలతో ఇతడు సంభోగించడంతో సుమారు 200 మంది పైగా జన్మించినట్లు చెబుతున్నారు.

అయితే... అనూహ్యంగా 1888 లో బ్రెజిల్ లో బానిసత్వం రద్దయ్యింది. దీంతో పటా సెకా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాడు. అనంతరం తనకు నచ్చిన మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పుడు అధికారికంగా తొమ్మిదిమంది బిడ్డలకు తండ్రయ్యాడు. ఇక అతడు సుమారు 130 సంవత్సరాలు బ్రతికి 1985లో మరణించాడని చెబుతున్నారు.