"కలిసుంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం"... పవన్ ట్వీట్ వైరల్!
పైగా అల్లు అర్జున్ కు స్టేషన్ బెయిల్ దక్కే సెక్షన్స్ కాకపోవడంతో.. పోలీసులు రిమాండ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 13 Dec 2024 10:20 AM GMTసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో ఆమె భర్త భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులో అల్లు అర్జున్ అరెస్టయారు. ఈ సమయంలో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైగా అల్లు అర్జున్ కు స్టేషన్ బెయిల్ దక్కే సెక్షన్స్ కాకపోవడంతో.. పోలీసులు రిమాండ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు.
దీనిపై స్పందించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ... "అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడం వల్లే తొక్కిసలాట జరిగింది" అని స్పష్టంగా పెర్కొన్న పరిస్థితి. మరోపక్క “చట్టం తన పని తాను చేసుకుపోతుందని” సాక్ష్యాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు! ఈ సమయంలో పవన్ ట్వీట్ ఇంట్రస్టింగ్ గా మారిందని అంటున్నారు.
అవును.. ఓపక్క అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిందని అంటున్నారు. మరో పక్క ట్విట్టర్ లోనూ ఈ విషయం ట్రెండింగ్ లో ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యలయం ఎక్స్ అకౌంట్ నుంచి పవన్ పేరుపై ఓ ఆసక్తికర ట్వీట్ తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... "ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా కనీసం రెండున్నర దశాబ్దాల పాటు రాజకీయ స్థిరత్వం అవసరం.. మనం కులాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోతే సాదించలేం.. 21 వ శతాబ్దంలో కూడా నా కులం, నా వర్గం అంటే కష్టం. విభేదాలు, సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం" అని ట్వీట్ చేశారు.
ఇదే సమయంలో... "ప్రతీ ఒక్కరూ అర్దం చేసుకుని విభేదాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో ప్రధానంగా... "కలిసుంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం.." అని సబ్జెక్ట్ తరహాలో పెట్టారు!!
దీంతో... పైన పేర్కొన్న ట్వీట్ లో "విభేదాలు, సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం.." అంటూ పొందుపరిచిన వాక్యాన్ని "కలిసుంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతాం.." అనే సబ్జెక్ట్ ని.. “విడిపోతే సాధించలేం” అనే పదాలను హైలైట్ చేస్తూ ఆన్ లైన్ వేదికగా చర్చ మొదలైంది.
ఇందులో భాగంగా... ఇది అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో రావడం కచ్చితంగా "పెర్ ఫెక్ట్ టైమింగ్!" అని కొందరంటే.. "ఇది దెప్పిపొడుపు!" అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. మరోవైపు అసలు అల్లు అర్జున్ అరెస్టుకు ఈ ట్వీట్ కు సంబంధం లేదని.. "స్వర్ణాంధ్ర @ 2047" విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా పవన్ ఈ ట్వీట్ చేశారని మరికొందరు చెబుతున్నారు.