Begin typing your search above and press return to search.

బీజేపీకి తాడో పేడో...బాబు పవన్ చేదోడు వాదోడు

తనకు సిద్ధాంత పరంగా భిన్న ధృవాల్లాంటి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలసిల్ శివసే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

By:  Tupaki Desk   |   16 Nov 2024 3:46 AM GMT
బీజేపీకి తాడో పేడో...బాబు పవన్ చేదోడు వాదోడు
X

మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీకి తాడో పేడో అన్నట్లుగానే ఉన్నాయి. 2019లో ఈ ఎన్నికల్లో శివసేన తో కలసి గెలిచినా రెండు పార్టీల మధ్య ఎన్నికల అనంతరం పొత్తు కుదరలేదు. ఎక్కువ సీట్లు వచ్చిన తామే సీఎం పోస్టు తీసుకోవాలని బీజేపీ భావించడం అలా కుదరదని శివసేన పంతానికి పోవడంతో కూటమి చీలిపోయింది.

తనకు సిద్ధాంత పరంగా భిన్న ధృవాల్లాంటి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలసిల్ శివసే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే అలా చీఫ్ మినిస్టర్ అయ్యారు అయితే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ నేత ఫడ్నవీస్ ని సీఎం చేయాలనుకున్న బీజేపీకి ఏక్ నాథ్ షిండే రూపంలో ముఖ్యమంత్రి సీటు పోయింది. ఇక ఉప ముఖ్యమంత్రిగానే ఫడ్నవీస్ గడపాల్సి వచ్చింది.

అయిదేళ్ళ పాలన ఎట్టకేలకు పూర్తి అయింది. బీజేపీ ఇమేజ్ కూడా దెబ్బ తిన్నది అని అంటున్నారు. ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఇపుడు ఎన్నికల్లో ప్రజల తీర్పు కోసం నిలబడింది. దానికి ముందే సంకేతాలు లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చేసారు అని అంటున్నారు.

సాధారణంగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. రాష్ట్ర ఎన్నికల్లో దెబ్బ తిన్నా తన బలం అలా నిరూపించుకుంటూ వస్తోంది. కానీ ఇపుడు చూస్తే సీన్ రివర్స్ అయింది. లోక్ సభ ఎన్నికల్లో శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకున్నాయి. ఈసారి ప్రభుత్వం తమదేనని ధీమాతో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీకి చావో రేవో లాంటి ఎన్నికలు తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ప్రచారానికి ఈ నెల 18తో చివరి రోజు. దాంతో తన ఎన్డీయే మిత్రులు అందరినీ కూడా బీజేపీ వాడేసుకుంటోంది.

ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లారు అంటేనే బీజేపీకి వారు చేయాల్సిన రాజకీయ సాయం ఏమిటో అది ఎంత అనివార్యమో అర్ధమవుతోంది.

ప్రత్యేకించి తెలుగు వారు ఉన్న చోటనే ఈ ఇద్దరు నాయకులు ప్రచారం చేయడం ద్వారా బీజేపీ వైపుగా ఆ ఓట్లను మళ్ళించాలని చూస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ఫుల్ ఫాం లో ఉంది. బాబు పవన్ జోడీ సక్సెస్ ఫుల్ గా ఉంది. అదే సక్సెస్ మంత్ర మహారాష్ట్రలో తెలుగు వారు ఉన్న చోట పనిచేస్తుందా అన్నదే చూడాల్సి ఉంది.

మరో వైపు చూస్తే ఈసారి ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలుచుకుంటే ప్రతిపక్షంలోకి శివసేన కాంగ్రెస్ ఎన్సీపీలను నెట్టడమే కాకుండా కూటమిలో మిత్రులు అయిన ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లను కూడా పక్కన పెట్టి సీఎం సీటు అధిరోహించాలని బీజేపీ ఆలోచిస్తోంది.

దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడం బీజేపీకి పెను సవాల్. ఈ సవాల్ లో నెగ్గితే కనుక బీజేపీకి తిరుగే లేదు. ఇక బాబు పవన్ తాము ప్రచారం చేసిన సీట్లలో కనుక బీజేపీకి సీట్లూ ఓట్లూ తెస్తే ఎన్డీయే కూటమిలో ఈ ఇద్దరికీ తిరుగు ఉండదని అంటున్నారు. మొత్తానికి చూస్తే మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు బంధం ఎలా ఉంటుందో బాబు పవన్ ల రాజకీయ జోడీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సిందే అని అంటున్నారు.