Begin typing your search above and press return to search.

జనసేనాని గర్జించారు...మౌనం బద్దలైంది !

ఆయన ప్రసంగాలతో ఏపీ రాజకీయాలో ఒక భీకరమైన పోరే సాగింది.

By:  Tupaki Desk   |   1 Nov 2024 3:22 PM GMT
జనసేనాని గర్జించారు...మౌనం బద్దలైంది !
X

పవన్ కళ్యాణ్ జనసేనానిగా ఎన్నికల సమయంలో ఆనాటి వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఫుల్ గా టార్గెట్ చేశారు అని చెప్పాలి. ఒక విధంగా వాడీ వేడీ ప్రసంగాలే చేశారు. ఆయన ప్రసంగాలతో ఏపీ రాజకీయాలో ఒక భీకరమైన పోరే సాగింది.

ఇక ఎన్నికలు పూర్తి అయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ ఉప ముఖ్యమంత్రి పవనిని అధిష్టించాక మౌనమే నా భాష అన్నట్లుగా ఉండిపోయారు. ఆయన ఎంత సేపూ తన శాఖ తన పని అని మాత్రమే వ్యవహరించారు. టీడీపీ నుంచి వైసీపీ వైపు విమర్శలు ధాటీగా ఉన్న జనసేనాని మాత్రం ఎక్కడా జోక్యం చేసుకోలేదు.

అధికారం చేతిలో ఉన్నా ఆయన ఎక్కడా దూకుడు చేయలేదు. అయితే అనూహ్యంగా ఎలూరు జిల్లాలో జరిగిన దీపం 2 సభలో మాత్రం పవన్ కళ్యాణ్ తన మౌనాన్ని బద్దలు కొట్టారు. తమది మెతక ప్రభుత్వం అనుకుంటే పొరపాటు అని వైసీపీని హెచ్చరించారు.

కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా ఇంకా మీ నోళ్ళు లేస్తున్నాయనుకుంటే వాటిని ఎలా లేవకుండా చేయాలో మాకు తెలుసు అని కూడా బిగ్ సౌండ్ చేశారు. ఘోర పరాజయం తరువాత కూడా మీ వైఖరి మారలేదని ఆయన వైసీపీ నేతల మీద మండిపడ్డారు.

ఏపీని సర్వనాశనం చేసి ఇపుడు విమర్శలు చేస్తారా అని ఫైర్ అయ్యారు ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నామని అన్నీ ఒకేసారి అవాలంటే కుదరదని అన్నారు. సోషల్ మీడియాలో మళ్ళీ దారుణమైన విమర్శలకు తెర తీశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

ఇలాంటి వారికి ఏమి చేయాలో బాగా తెలుసు అన్నారు. తాట తీస్తా నారా తీస్తా అని జనసేనాని పదజాలాన్ని ఆయన ఉపయోగించారు. మళ్ళీ అధికారంలో ఉన్నప్పటి మాదిరిగా విమర్శలు చేస్తామంటే తాను కూడా దానికి సిద్ధమే అన్నారు. మీరు యుద్ధాన్ని కోరుకుంటే తాను దానికి సంసిద్ధం అని కూడా పవన్ ప్రకటించడమూ విశేషం.

మీకు గొడవలు కావాలీ అనుకుంటే దానికి కూడా రెడీ అన్నారు జనసేనాని. వైసీపీ నేతల మీద చాలా బలమైన చర్యలు ఉంటాయని ఆ తరువాత రోడ్ల మీదకు వచ్చి రాస్తారోకో చేస్తామని అన్నా కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెడతామని కూడా పవన్ మార్క్ వార్నింగ్ ఇచ్చేశారు.

ఈసారి వైసీపీ నేతలు ఎవరికీ నోళ్ళు లేవకుండా కూడా చూసుకుంటామని ఆయన అంటున్నారు. మొత్తానికి పవన్ లో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా తన ప్రసంగంలో ఆవేశం పాలు కనిపించింది. దానికి కారణాలు ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఏపీలో వైసీపీ నేతలు గతంతో పోలిస్తే చాలా మటుకు తగ్గిపోయారు అని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో కొన్ని చోట్ల మాత్రం కొంత ఇంకా వ్యవహారం అలా సాగుతోంది. మరో వైపు వైసీపీ ఇటీవల కాలంలో ప్రభుత్వం మీద విమర్శల దాడిని పెంచింది. దానికి టీడీపీ నుంచి గట్టిగా కౌంటర్లు వెళ్తున్నాయి.

కూటమి అన్ని రకాలుగా ఫెయిల్ అయిందని వైసీపీ చేస్తున్న విమర్శలకు ఇపుడు జనసేన కూడా తన వంతు రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేసింది అని అంటున్నారు. మొత్తం మీద చాలా కాలానికి పవన్ గర్జించారు అని ఆయనలో ఫైర్ ఒక రేంజిలో కనిపించింది అని అంటున్నారు. దాంతో ఏపీ రాజకీయం కూడా ఇక మీదట మరో లెవెల్ అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.