పంచాయతీలను టార్గెట్ చేసిన పవన్
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలను లక్ష్యంగా చేసుకున్నారు.
By: Tupaki Desk | 9 Sep 2024 3:57 AM GMTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన పార్టీ మరో అయిదేళ్లలో పటిష్టంగా మారాలీ అంటే రూరల్ సెక్టార్ లోనే గట్టిగా నిలబడాలని డిసైడ్ అయ్యారు. అందుకే పవన్ ఏరి కోరి మరీ గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నారు.
దాంతో ఆయనకు పంచాయతీలు గ్రామాల మీద పట్టు పెరిగింది. ఇపుడు అనుకోని ఉపద్రవంగా వరదలు సంభవించాయి.దాంతో పవన్ కళ్యాణ్ గతంలో ఏ రాజకీయ నేత కూడా చేయని విధంగా తన సొంత నిధుల నుంచి భారీ విరాళాలు ఇచ్చారు. ఏకంగా ఆరు కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వడమంటే అది సామాన్య విషయం అయితే కాదు.
పవన్ అందులో ఒక కోటి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కి మరో కోటి రూపాయలు తెలంగాణా స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చి తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అని చాటి చెప్పారు. ఏపీకి డిప్యూటీ సీఎం అయినా కూడా తెలంగాణా మీద కూడా తనకు ప్రేమ అభిమానం సరిసమానంగా ఉన్నాయని పవన్ చాటి చెప్పారు.
మరో వైపు చూస్తే ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఆయన నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కో దానికీ లక్ష రూపాయలు వంతున వరద సహాయక చర్యల కోసం ఇవ్వడం అంటే అది గ్రేట్ అనే చెప్పాలి. ఇది కూడా అరుదైన విషయంగానే అంతా చూస్తున్నారు.
ఎందుకంటే వరదలు వస్తే ప్రభుత్వాలకే నేరుగా సాయం అందిస్తారు తప్పించి గ్రామాలకు ఇవ్వరు. వారు మళ్ళీ ప్రభుత్వానికి నివేదించుకోవాలి. అపుడు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. ఆ తతంగానికి చాలా సమయం పడుతుంది. అందుకే ప్రభుత్వ సాయం వచ్చేంతవరకూ వేచి ఉండకుండా దెబ్బ తిన్న పంచాయతీలకు ఒక్కోదానికి లక్ష రూపాయలు ఇవ్వడం అంటే మంచి పనే అని వేరేగా చెప్పాల్సింది లేదు.
ఆ విధంగా పవన్ కళ్యాణ్ పంచాయతీలకు లక్ష వంతున ఇవ్వడం ద్వారా పంచాయతీల మనసు చూరగొన్నారు. ఏపీలో ఏకంగా ఆరు జిల్లాల్లో దాదాపుగా నాలుగు వందల పంచాయతీలు చిక్కుకుని దెబ్బ తిన్నాయి. దాంతో వాటిని గుర్తించి సహాయం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
ఈ నెల 9న సోమవారం ప్రతీ పంచాయతీకి లక్ష రూపాయలు వంతున ఆర్ధిక సాయం అందించేందుకు వాటిని ఆదుకునేందుకు జనసేన నేతలు కూటమి నేతల ఆద్వర్యంలో భారీ ఎత్తున పంపిణీ చేపడుతున్నట్లుగా ఆయన వెల్లడించాఉర్.
ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి అలగే ఆస్తుల పరిరక్షణకు, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాల నిర్వహణకు వినియోగించాలని నాదేండ్ల సర్పంచులను కోరారు. మొత్తానికి జనసేనకు ఇది రాజకెయంగా కూడా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఏపీలఒ మొత్తం 13 వేల పంచాయతీలు ఉంటే అందులో మూడవ వంతు పంచాయతీలకు ఈ భారీ సాయం వల్ల జనసేన క్షేత్ర స్థాయిలో మంచి పట్టు సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.