పంచాయతీలకు ప్రాణం.. పవన్ విరాళం ..!
ఇదేసమయంలో మరో 4 కోట్ల రూపాయలను పంచాయతీలకు ఇచ్చారు.
By: Tupaki Desk | 11 Sep 2024 8:30 PM GMTజనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన రూ.4 కోట్ల రూపాయల విరాళాలు.. పంచాయతీ లకు ప్రాణం పోస్తున్నాయి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. విజయవాడకు సంభవించిన విపత్తుల నేపథ్యంలో ఆయన కోటి రూపాయలను వరద ప్రభావితప్రాంతాలకు ఇచ్చారు. ఇదేసమయంలో మరో 4 కోట్ల రూపాయలను పంచాయతీలకు ఇచ్చారు. ఒక్కొక్క పంచాయతీకి రూ.లక్ష చొప్పున 400 పంచాయతీలకు విరాళం ఇచ్చారు.
ఈ నిధులు తక్కువా ఎక్కువా అనే చర్చ ఒక వైపు సాగుతోంది. అయితే.. తక్కువ, ఎక్కువలు అనే మాట పక్కన పెడితే.. ప్రస్తుతం పంచాయతీలు ఉన్న పరిస్థితిలో ఈ నిదులు ఆయా పంచాయతీలకు ప్రాణం పోసినట్టేనని అంటున్నారు సర్పంచులు. ప్రస్తుతం.. పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు లేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గతంలోనే సమీక్షల సమయంలో పవన్ చెప్పారు. అయితే.. వాస్తవానికి కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తారని భావించారు.
కానీ, ఇప్పటికే 2023-24కు సంబంధించిన నిధులను కేంద్రం ఇచ్చింది. ఈ నిదులు ఎటు పోయాయో తెలియడం లేదన్నది సర్పంచుల ఆవేదన. దీంతో రాష్ట్ర సర్కారు నుంచి పవన్ నిధులు ఇప్పించే ప్రయత్నం చేశారు. అయితే.. ఇది కూడా సాధ్యం కాదనేది స్పష్టమైంది. దీంతో తనే స్వయంగా రంగం లోకి దిగి 4 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. నిజానికి మంత్రిగా ఉన్న వారు ఇప్పటి వరకు ఎవరూ ఇలా చేసింది లేదు. తాము ఇప్పించారే తప్ప.. ఇప్పించిన వారు లేరు.
కానీ, దీనికి భిన్నంగా పవన్ కల్యాణ్.. తన సొంత జేబు నుంచి విరాళం ఇచ్చారు. ఇది ఆయనకు బలమైన ఫాలోయింగ్‌ను పెంచింది. పైగా.. రాజకీయంగా కూడా.. పవన్‌కు పంచాయతీల్లో మంచి ఇమేజ్ తీసుకువ చ్చింది. ఇప్పటి వరకు రూపాయి నిధులు లేని పంచాయతీలకు కళ వచ్చింది. చిన్నపాటి పనులు చేయించుకునేందుకు.. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఈ విషయం రాజకీయంగానే కాకుండా.. సామాజికంగా కూడా పవన్‌కు మంచి మార్కులు వేయిస్తుండడం గమనార్హం.