Begin typing your search above and press return to search.

పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడీ అండ్ బాబు!

ఆయన ఉంటేనే ఏదైనా సాధ్యం అని నమ్మే వారు అత్యధికులు ఉన్నారు.

By:  Tupaki Desk   |   29 Nov 2024 9:30 AM GMT
పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడీ అండ్ బాబు!
X

దేశంలో నరేంద్ర మోడీ అప్రతిహతమైన విజయాలను అందుకుంటున్నారు. ఆయనను మెచ్చే జనాలు ఎక్కువ మందే ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఉన్నత వర్గాలలో నరేంద్ర మోడీ అంటే ఒక రకమైన ఇమేజ్ ఉంది. ఆయన ఉంటేనే ఏదైనా సాధ్యం అని నమ్మే వారు అత్యధికులు ఉన్నారు.

ఇక ఏపీలో సీఎం గా నాలుగవ సారి గెలిచి అధికారంలో ఉన్న నారా చంద్రబాబు విషయంలో ఇదే ఉంది. ఆయనకు కూడా ఎక్కువగా ఉన్నత వర్గాలు మధ్య తరగతి వర్గాల మద్దతు దక్కుతోంది. ఇలా ఎందుకు అంటే ఈ రెండు వర్గాలు ఎక్కువగా అభివృద్ధిని కోరుకుంటాయి.

ఆ విధంగా చూస్తే కనుక మోడీ అండ్ చంద్రబాబు మార్క్ అభివృద్ధి మీద ఈ సెక్షన్లు పెద్ద ఎత్తున నమ్మకంతో ఓట్ల వర్షం కురిపిస్తాయి. ఇక పోతే మోడీ సంక్షేమ పథకాలకి వ్యతిరేకం అని అంటారు. పేద వర్గాలు సంక్షేమం విషయంలో ఎంతో ఆశగా చూస్తాయి.

అయినా సరే అభివృద్ధి అజెండాతోనే మోడీ పదే పదే గెలుస్తూ వస్తున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు కూడా 2004 వరకూ చూస్తే సంక్షేమం కంటే అభివృద్ధి ముఖ్యమని నమ్ముతూ వచ్చారు. అయితే రెండు సార్లు ఓడిన తరువాత బాబులో భారీ మార్పు వచ్చింది అందుకే ఆయన 2014 నుంచి అభివృద్ధి ప్లస్ సంక్షేమం అంటున్నారు.

ఈ రెండింటినీ ఆయన బాలెన్స్ చేస్తూ వస్తున్నారు. అయినా సరే బాబు మొగ్గు ఎపుడూ అభివృద్ధి మీదనే ఉంటుంది. అలా చూస్తే కనుక మోడీ బాబులో కామన్ పాయింట్ ఇదే అని అంతా చెబుతారు.వారు అభివృద్ధి కోణంలో ఎక్కువగా అలోచిస్తారు.

అంతే కాదు వినూత్న ఆలోచనలు కూడా చేస్తారు. అదే విషయం ఈ ఇద్దరికీ ఉమ్మడి మిత్రుడు అయిన పవన్ కళ్యాణ్ పసిగట్టారు. ఆయన ఒక జాతీయ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. మోడీ బాబులలో కామన్ పాయింట్ ఏంటి అని యాంకర్ వేసిన ప్రశ్నకు పవన్ చాలా లాజికల్ గా ఆలోచనాత్మకంగా జవాబు చెప్పారు

మోడీ చంద్రబాబు ఇద్దరూ డెవలప్మెంట్ కోసం పూర్తి స్థాయిలో కమిట్మెంట్ ఉన్న నేతలు అని పవన్ చెప్పడం విశేషం. అంతే కాదు ఇద్దరూ అభివృద్ధి విజన్ తోనే ముందుకు సాగుతారు. వారు అభివృద్ధి ఆలోచనలతోనే నిరంతరం సాగుతారు అని కూడా పవన్ చెప్పారు.

ఇకపోతే ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా ఇతరత్రా ఎన్నో హర్డిల్స్ ఉన్నాయని అయినా సరే ఆయన వాటిని అన్నింటినీ దాటుకుని మరీ తన మార్క్ అభివృద్ధిని చూపిస్తున్నారు అని కొనియాడారు. మొత్తం మీద చూస్తే పవన్ నరేంద్ర మోడీని ఎందుకు అభిమానిస్తున్నారు చంద్రబాబుని ఎందుకు పొగుడుతారు అని ఎవరైనా డౌట్ పడితే వారికి ఆయన ఇచ్చిన తాజా జవాబుతో ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉండాలి.

పవన్ బేసికల్ గా దేశం రాష్ట్రం అభివృద్ధి కావాలని చూస్తారు. ఆయన రాజకీయాలకు అతీతంగానే అన్నీ ఆలోచిస్తారు. అందుకే ఆయన కేంద్రంలో మోడీకి ఏపీలో బాబుకి మద్దతు ఇచ్చారు. అది ఆయన 2014 నుంచి చేస్తూ వస్తున్నారు. తన విధానంలో మార్పు లేదని 2024 ఎన్నికల్లో మరోమారు నిజం చేసి కూటమిని నెగ్గించడం ద్వారా రుజువు చేశారు.

ఏది ఏమైనా అభివృద్ధి ఉంటేనే సంక్షేమం అందించవచ్చు. అలాగే అభివృద్ధి ఉంటేనే దేశం ముందుకు పరుగులు తీస్తుంది. ఈ విధంగా ఆలోచిస్తే కనుక అభివృద్ధి అజెండా ఎప్పటికీ తిరుగులేని ఆయుధం. దానిని అందుకున్న వారికి కూడా ఎదురులేని విజయం దక్కుతుంది. వారే చరిత్రలో నిలుస్తారు. ఈ తరంలో మాత్రం మోడీ బాబు తమదైన విజన్ తోనే ఈ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నారు అని గట్టిగా ఘంటాపధంగా చెప్పవచ్చు. పవన్ చెప్పిన దాంటో సారాంశం, అశలు సందేశం కూడా ఇదే.