రూ.10 లక్షల బుక్స్ కొన్న పవన్ కల్యాణ్... ఏవేమిటో తెలుసా?
అవును... పవన్ కల్యాణ్ మరో సంచలనం సృష్టించారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ లో ఒకేసారి రూ.10 లక్షల విలువైన పుస్తకాలు కొన్నారు.
By: Tupaki Desk | 11 Jan 2025 12:35 PM GMTపవన్ కల్యాణ్ తనకు పుస్తకాలు అంటే ఎంతో ఇష్టమని.. తన తల్లితండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని.. కోటి రూపాయలు ఇవ్వడానికైనా ఆలోచించను కానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. పవన్ కల్యాణ్.. 2 లక్షల పుస్తకాలు చదివారని కూడా చెబుతారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... పుస్తక పఠనం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పే పవన్ కల్యాణ్ మరో సంచలనం సృష్టించారు. ఇందులో భాగంగా.. విజయవాడలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ ను ఇవాళ మరోసారి సందర్శించిన ఆయన.. భారీగా పుస్తకాలు కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా.. ఏకంగా రూ.10 లక్షల విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు పవన్.
అవును... పవన్ కల్యాణ్ మరో సంచలనం సృష్టించారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ లో ఒకేసారి రూ.10 లక్షల విలువైన పుస్తకాలు కొన్నారు. దీంతో.. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ లో పుస్తకాలు కొన్న రికార్డ్ నెలకొల్పినట్లయ్యిందని అంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయా స్టాళ్లను సందర్శించారు పవన్.
ఈ సందర్భంగా.. 6 - 9 తరగతుల పుస్తకాలతో పాటు ఎకనామిక్స్, ఫైనాన్స్ పుస్తకాలు, డిక్షనరీ, తెలుగులో అనువదించిన ఖురాన్ కూడా పవన్ కొనుగోలు చేసిన పుస్తకాల్లో ఉన్నాయని అంటున్నారు. వీటితో పాటు తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్, కల్యాణి పబ్లికేషన్స్ సహా మరికొన్ని స్టాళ్లను సందర్శించిన పవన్.. పలు పుస్తకాలు కొనుగోలు చేశారు.
వాస్తవానికి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని యువత కోసం ఓ లైబ్రరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారంట. దీని కోసమే ఇంత భారీ ఎత్తున పుస్తకాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం పవన్ కల్యాణ్ తన సొంత డబ్బులు వెచ్చించినట్లు చెబుతున్నారు. దీంతో... త్వరలో పిఠాపురంలో పలు ఆసక్తికర, విలువైన పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటయ్యబోతోందని అంటున్నారు.
కాగా.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 2వ తేదీన పుస్తక మహోత్సవాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రేపటితో (జనవరి 12) తో ఈ పుస్తక మహోత్సవం ముగియనుంది. సుమారు మూడున్నర దశాబ్ధాలుగా విజయవాడలో ప్రతీ ఏటా ఈ పుస్తక మహోత్సవం నిర్వహిస్తోన్నారు.