ఛాలెంజ్ చేసిన తొడలను బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్
జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 15 March 2025 9:50 AM ISTజనసేన 12వ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్టీ నేతలు అనేక మంది ఓడిపోయినప్పుడు కొందరు(వైసీపీ) తీవ్రంగా అవమానించా రని తెలిపారు. అయినా.. అనేక అవమానాలు, ఇబ్బందులు పడి మరీ నిలబడినట్టు చెప్పారు. 2019లో పార్టీ ఓడిపోయినట్టు.. తీవ్ర విమర్శలు చేశారని తెలిపారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేరని కొందరు తొడలు కొట్టారని పేర్కొన్నారు.
కానీ, 2024 ఎన్నికల్లో ఇలా తొడలు కొట్టిన వారిని బద్దలు కొట్టామని పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే.. ఓడిపోయినా అడుగులు ముందుకు వేసినట్టు చెప్పారు. దేశమంతా మనవైపే చూసేలా చేశామని, 21 సీట్లకు 21 సీట్లు, 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయం దక్కించుకుని 100 శాతం స్ట్రయిక్ రేట్ దక్కించుకు న్నట్టు చెప్పారు. దేశం అంతా మనవైపు చూసేలా చేశామన్నారు.
``నిలబడ్డాం.. నిలబెట్టాం.. ఛాలెంజ్ చేసిన తొడలను బద్దలు కొట్టాం`` - అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించా రు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీని కూడా తాము నిలబెట్టినట్టు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక, తన జన్మస్థలం నెల్లూరు అయినా.. తనకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ అని, కర్మస్థలం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వ మని చెప్పిన వారు.. అధికారంలో ఉన్నప్పుడు.. అనేక హింసలకు గురి చేశారని తెలిపారు.
450 మంది ప్రాణాలు త్యాగం చేస్తే.. జనసేన పార్టీ నిలబడిందన్నారు. సినిమాలతో సంబంధం లేకుండా.. 450 మంది కార్యకర్తలు.. సైద్ధాంతికాలను నమ్మారని చెప్పారు. వారి పట్ల పార్టీకి ఎంతో గౌరవం ఉందన్నా రు. అందుకేతాను.. రాజకీయ సభల్లో సినిమాల గురించి వద్దని చెబుతానని అన్నారు.