Begin typing your search above and press return to search.

తిరుపతి ఘటన.. అధికారులను తనదైన శైలిలో ప్రశ్నించిన పవన్!

ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. ఈ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకున్నారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 12:24 PM GMT
తిరుపతి ఘటన.. అధికారులను తనదైన శైలిలో  ప్రశ్నించిన పవన్!
X

తిరుపతిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి జారీ చేసే టోకెన్ల కోసం క్యూలో ఉన్న భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. ఈ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకున్నారు.

అవును.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం, పదుల సంఖ్యలో భక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా... బైరాగిపట్టేడలోని పద్మావతి పార్క్ వద్దకు వచ్చారు.

ఈ సందర్భంగా... తొక్కిసలాట జరిగి శ్రీవారి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో.. ప్రమాదం జరిగిన తీరును చిత్తురు జిల్లా ఎస్పీ మణికంఠ, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికరులను పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రశ్నించారు.

ఇందులో భాగంగా... భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లలోకి వదలాల్సి వచ్చింది? అని పవన్ కల్యణ్ అధికారులను ప్రశ్నించారు. దీంతో... హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్కుకు వచ్చారని అధికారులు తెలిపారని తెలుస్తోంది.

మరోపక్క అప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరుపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని సూచించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై చంద్రబాబు మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలని.. తమాషా అనుకోవద్దని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.