ఏపీలో స్కూలు పిల్లలకు కొత్త మావయ్య దొరికారా?
ఈ క్రమంలో తాజాగా "పేరెంట్స్ - టీచర్స్" మీటింగ్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నేపథ్యంలో... కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
By: Tupaki Desk | 7 Dec 2024 12:30 PM GMTతమ ప్రభుత్వ హయాంలో వైసీపీ అధినేత జగన్.. తాను చేపట్టిన "నాడు-నేడు", "అమ్మ ఒడి", మిడ్ డే మీల్స్ పథకాలతోపాటు పిల్లలకు ఇచ్చిన యూనిఫారమ్స్, షూస్, బ్యాగ్, ట్యాబ్స్ వంటి వాటితో స్కూలు పిల్లలకు బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వారంతా జగన్ ను "జగన్ మావయ్య" అని పిలవడం మొదలుపెట్టారు! ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమాల్లోనూ ఈ పిలుపే వినిపించేది.
జగన్ తాను చేసే ప్రతీ ప్రసంగంలోనూ "మీ జగన్ మావయ్య" అని ప్రస్థావించేవారు. దీంతో.. ఈ పదం ఏపీ రాజకీయల్లో ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో తాజాగా "పేరెంట్స్ - టీచర్స్" మీటింగ్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నేపథ్యంలో... కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్కూలు పిల్లలతో సరదగా గడిపారు. వారి చదువుల గురించి మాత్రమే కాకుండా.. ఆటలు, పాటలు, ముగ్గులు, ఆటల్లో సాధించిన బహుమతులు.. మొదలైన విషయాల గురించి వారితో మాట్లాడారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాల గురించి నేరుగా అడిగి తెలుసుకున్నారు. అడిగినవారందరికీ ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు.. సందడి చేశారు.
వాస్తవానికి పవన్ కల్యాణ్ సినిమా హీరోగా పిల్లలకు బాగా నచ్చుతారని అంటుంటారు. ఆయన ఫైట్లు, ఆయనకు మాత్రమే సొంతమైన కొన్ని మ్యానరిజమ్స్, ఆయన స్టైల్ యువతతో పాటు స్కూలు పిల్లలకు బాగా నచ్చుతాయని చెబుతుంటారు. అలాంటి పవర్ స్టార్.. డిప్యుటీ సీఎంగా తమ ముందుకు రావడం డబుల్ హ్యాపీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాత్రి టీవీలో వచ్చిన సినిమాల్లోనో, అంతక ముందు థియేటర్ లోనో కనిపించిన స్టార్ ఇలా తమతో కలిసి మాట్లాడటం, చదువులు - ఆటల గురించి అడిగి తెలుసుకోవడం, ఎంతో ఓపికగా అడిగినవారందరికీ ఆటో గ్రాఫ్ లు ఇవ్వడంతో ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఇకపై ఏపీలో విద్యార్థులకు మావయ్య పవన్ కల్యాణ్ అయ్యారని!
అవును... ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన పేరెంట్స్ – టీచర్స్ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో గడిపిన సంఘటన, పిల్లలు పవన్ తో పంచుకున్న విషయాలు, వారి మధ్య కనిపించిన ఆత్మీయ దృశ్యాలు వెరసి.. ఏపీలో పిల్లలకు జగన్ తర్వాత కొత్త మావయ్యగా పవన్ కల్యాణ్ ఉన్నట్లున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.