Begin typing your search above and press return to search.

కుంభమేళాలో పవన్ పిక్స్ పై ట్రోల్స్... పోలీస్ యాక్షన్ స్టార్ట్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన పిక్స్ పై సోషల్ మీడియాలో పలువురు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   21 Feb 2025 8:10 AM GMT
కుంభమేళాలో పవన్ పిక్స్ పై ట్రోల్స్... పోలీస్ యాక్షన్ స్టార్ట్!
X

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల ప్రయాగ్ రాజ్ లో జరుగుతోన్న మహా కుంభమేళాలో పాల్గొన్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా... ఆయన సతీసమేతంగా గంగానదిలో పవిత్ర స్నానమాచరించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలో.. ఆయన ఆ ఫోటోల్లో ఒంటిపై షర్ట్ లేకుండా.. జంధ్యం ధరించి కనిపించారు. ఆ ఫోటోల్లో పవన్ కాస్త ఒళ్లు చేసినట్లు కనిపించారు. దీంతో.. ఈ ఫోటోలను నెట్టింట పలువురు ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది మార్ఫింగ్ చేసి, కాస్త ఎబ్బెట్టుగా మార్పులు చేసి మరీ ట్రోల్స్ చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో... ఈ వ్యవహారంపై యాక్షన్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తోంది.

అవును.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన పిక్స్ పై సోషల్ మీడియాలో పలువురు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఆయనకు పొట్ట వచ్చిందని.. ఫిట్ నెస్ పోయిందని కామెంట్స్ చేస్తూ.. ఎబ్బెట్టు వ్యాఖ్యలు, అసభ్య పదప్రయోగాలు చేస్తున్నారని అంటున్నారు. దీనిపై జనసైనికులు ఫైర్ అయ్యారు!

ఇందులో భాగంగా... సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరం కామెంట్స్ పై స్పందించాలని కోరారని తెలుస్తోంది. దీంతో... ఈ వ్యవహారంపై ఏపీ పోలీసులు యాక్షన్ స్టార్ట్ చేశారని తెలుస్తోంది.

వాస్తవానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోల్లో ఫుల్ ఫిట్ గా ఉండటంతో పాటు సిక్స్ ప్యాక్స్ అనే టాపిక్ లేని రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం కలిగి తనదైన ఫిట్ నెస్ లో ఉండేవారు పవన్ కల్యాణ్. అదే ఆయనకు.. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టిందని కూడా చెప్పొచ్చు. ఆయన ఫిట్ నెస్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉండేవారని అంటారు.

అయితే.. పవన్ కల్యాణ్ చాలాకాలంగా పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. పగలూ రాత్రి అనే తేడా లేకుండా ఆయన ఇంతకాలం ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు! ఈ సమయంలో.. బాడీ ఫిట్ నెస్ పై కాస్త దృష్టి సారించే పరిస్థితి లేకపోయి ఉండవచ్చు. అది తప్పుడు కామెంట్లు చేసేటంత విషయం కాదు!

ఇప్పుడు ఏపీ ప్రజలు పవన్ లో చూడాల్సింది పరిపాలనా సామర్థ్యం.. అందులో తీసుకుంటున్న నిర్ణయాలు.. ఇచ్చిన హామీల దిశగా ఆయన చేస్తున్న ప్రయత్నాలను పరిగణలోకి తీసుకోవాలి.. ఆ విధంగా సద్వివిమర్శలు చేయాలే కానీ.. ఇలా పొట్ట పెరిగింది, ఒళ్లొచ్చింది లాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం ఏమాత్రం సహేతుకం కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో... పవన్ పై బాడీ షేమింగ్స్ కి పాల్పడినవారిపై ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు అందాయని చెబుతున్నారు. ఏపీలో పోలీసులు యాక్షన్ లోకి దిగారని అంటున్నారు. ఒకప్పుడు ఇలా పవన్ ఫోటోలతో పాటు చంద్రబాబు, లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసినందుకే ఆర్జీవీ పోలీసు విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.