Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కంచుకోటలను కూల్చేసిన పవన్

పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలను దాటింది. మహారాష్ట్రలో బిగ్ సౌండ్ చేసింది.

By:  Tupaki Desk   |   24 Nov 2024 12:13 PM GMT
కాంగ్రెస్ కంచుకోటలను కూల్చేసిన పవన్
X

పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలను దాటింది. మహారాష్ట్రలో బిగ్ సౌండ్ చేసింది. దాంతో ఎపుడూ గెలిచే సీట్లు కంచుకోటలను కాంగ్రెస్ పవన్ దెబ్బకు కోల్పోయింది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమికి మొత్తం 288 సీట్లకు గానూ 233 సీట్లు దక్కాయి.

ఇక బీజేపీ మిత్ర పక్షాలు సాధించిన ఈ ఘన విజయంలో పవన్ క్రెడిట్ ఎంత అన్న చర్చ అయితే సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఈసారి కొన్ని కీలకమైన ప్రాంతాలలో పర్యటించి ఎన్డీయే తరఫున ప్రచారం చేశారు. అది కూడా పెద్ద ఎత్తున చేశారు. రెండు రోజుల పాటు పవన్ చేసిన ప్రచారం మొత్తం పది అసెంబ్లీ సీట్లలో సాగింది. అయితే ఈ సీట్లు అన్నీ కూడా బీజేపీకి మిత్రులకు దక్కడం విశేషం. అయితే ఇందులో ఏమి ఉంది అనుకోవడానికి లేదు. పవన్ ప్రచారం చేసిన సీట్లు చాలా వరకూ కాంగ్రెస్ దాని మిత్రులకు కంచుకోటలు. అక్కడ మరో పార్టీ గెలిచిన దాఖలాలు చాలా ఎన్నికల్లో లేవు

అలాంటి టఫ్ జాబ్ పవన్ కి ఇస్తే ఆయన దానిని చాలా ఈజీగా చేదించి బీజేపీని మిత్రులకు ఘన విజయం రూపంలో తీరాలకు చేర్చగలిగారు అని అంటున్నారు. కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆయన కుమార్తె ప్రణతి షిండె షోలాపూర్ నుంచి ఏడు సార్లు గెలిచారు.

అలాంటి కంచుకోట ఇపుడు మహాయుతి కూటమి వశం అయింది అంటే పవన్ ప్రచారం మహిమ అని అంటున్నారు. ఆ సీట్లో వేరే పార్టీ కొన్ని దశాబ్దాలుగా గెలిచింది లేదు అని అంటున్నారు. ఇలా షోలాపూర్ లో పవన్ వన్ మాన్ షోగా ప్రచారం సాగింది సూపర్ హిట్ అయింది అని అంటున్నారు. అంతే కాదు తెలుగు ప్రాంతాలు ఉన్న చోట పవన్ చేసిన ప్రచారాన్ని బ్రహ్మాండమైన ఆదరణ దక్కింది అని ఫలితాలు చెబుతున్నాయి.

ఇక మహారాష్ట్ర ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిక కేకే పవన్ ప్రచారం గురించి తనదైన విశ్లేషణ వినిపించారు. పవన్ ప్రభావం మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ఉందని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ ప్రచారం చేయడం వల్లనే ఎన్డీయేకు గట్టి పోటీగా ఉన్న చాలా సీట్లు అనుకూలంగా మారాయని అన్నారు. ఈ సీట్లు గతంలో ఎన్డీయే కూటమికి దక్కనివే అని అంటున్నారు. అంతే కాదు పవన్ ప్రచారం వల్ల ఈ సీట్ల వరకే కాకుండా మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో అనేక చోట్లై ఇతర బీజేపీ అభ్యర్ధులు, ఎన్డీయే మిత్రులకు హెల్ప్ అయిందని అంటున్నారు.

ఆయా చోట్లో కూడా గతానికంటే కూడా పెద్ద ఎత్తున మెజారిటీలతో వారు గెలిచారు అని ఉదహరిస్తున్నారు. ఇక పవన్ స్పీచ్ లో ఎమోషనల్ టచ్ ఉండడంతో పాటు ఓటర్లను ఎన్డీయేకు అనుకూలంగా మార్చడంలో ఆయన పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. పవన్ మానియాను మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్ద ఎత్తున సృష్టించగలిగారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేసిన ప్రచారంలో ఎన్డీయే కూటమికి భారీ రాజకీయ లబ్ది కలిగింది అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన సైనికులు మా నాయకుడు నేషనల్ అని అంటున్నారు. అవును జాతీయ రాజకీయాల్లో పవన్ పాత్ర మరింతగా పెరిగేలా ఈ ప్రచారం దానికి తోడుగా ఫలితాలు ఉన్నాయని అంటున్నారు.

రానున్న రోజులలో పవన్ ప్రచారాన్ని మరింతంగా ఎన్డీయే నేతలు ఉపయోగించుకుంటారు అని అంటున్నారు. పవన్ కి సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఉన్న గౌరవం, వెండితెర మీద ఆయనకు ఉన్న పవర్ ఫుల్ స్టార్ డం అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఇవన్నీ కలిస్తే దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో పవన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది.

దాంతో పవన్ కళ్యాణ్ ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలలో సైతం రానున్న రోజులలో బీజేపీ వినియోగించుకుంటుంది అని అంటున్నారు. అందువల్ల పవన్ లోకల్ కాదు నేషనల్ అని జనసైనికులు ఇపుడు గర్వంగా కాలరెగస్తున్నారు. దటీజ్ పవర్ స్టార్ మేనియా అని కూడా గొప్పగా చెబుతున్నారు.