Begin typing your search above and press return to search.

'సంప‌ద సృష్టి' కేంద్రాల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కామెంట్స్‌

తాజాగా సంప‌ద సృష్టి పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

By:  Tupaki Desk   |   19 Nov 2024 2:30 PM GMT
సంప‌ద సృష్టి కేంద్రాల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కామెంట్స్‌
X

ఏపీలో సంప‌ద సృష్టిస్తాం.. పేద‌ల‌కు పంచుతాం అంటూ.. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌స్తుత సీఎం చంద్ర బాబు చెప్పిన విష‌యం తెలిసిందే. తాజాగా సంప‌ద సృష్టి పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శాస‌న మండ‌లిలో ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న ఆన్స‌ర్ ఇచ్చారు. సంప‌ద సృష్టి కేంద్రాల‌ను గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. చెత్త‌ను వినియోగించి సంప‌ద సృష్టించ‌డంపై వారికి శిక్ష‌ణ కూడా ఇస్తున్న‌ట్టు తెలిపారు.

చెత్త డంపింగ్ యార్డుల‌ను ఏర్పాటు చేసి.. అక్క‌డ నుంచి చెత్త‌ను సంప‌ద సృష్టి కేంద్రాల‌కు త‌ర‌లిస్తు న్న‌ట్టు తెలిపారు. దీనికి సంబంధించి నిధులు కూడా గ్రామీణ ప్రాంతాల‌కు విడుద‌ల చేసిన‌ట్టు వివ‌రిం చారు. 15వ ఆర్థిక సంఘం నుంచి కేటాయించిన నిధుల‌ను నేరుగా ఈ సంప‌ద సృష్టి కేంద్రాల‌కు పంపుతు న్నామ‌న్నారు. వీటి వ‌ల్ల యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తుంద‌ని, అదేవిధంగా పున‌రుత్ప‌త్తి ద్వారా.. గ్రామాల‌కు త‌ద్వారా రాష్ట్రానికి కూడా ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని వివ‌రించారు.

గ్రామీణ ప్రాంతాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచాల‌న్న‌దే తమ ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించా రు. ప‌రిశుభ్ర‌త అనేది అదిలిస్తే వ‌చ్చేది కాద‌ని, వ్య‌క్తిగ‌తంగా ఇంటినుంచేనేర్చుకోవాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. ప్ర‌తి ఒక్క‌రూ గ్రామీణ ప్రాంతాల‌ను త‌ర‌చుగా సంద‌ర్శించాల‌ని సూచించారు. త‌ద్వారా.. గ్రామీణ ప్రాంత వాతావ‌ర‌ణం.. అక్క‌డి ప్ర‌జ‌ల సంస్కృతులు, ఆచారాలు, వ్య‌వ‌సాయం వంటివి నేటి త‌రానికి చేరువ అవుతాయ‌ని పేర్కొన్నారు.