బీజేపీకి పవన్ మహా సాయం...అంతా ఓకే !
ఇదిలా ఉంటే బీజేపీకి ప్రాణ అవసరంగా మారిన మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయాలని పవన్ ని అమిత్ షా ఈ భేటీలో కోరారని అంటున్నారు.
By: Tupaki Desk | 6 Nov 2024 8:30 PM GMTకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక భేటీ వేశారు. ఈ భేటీ సారాంశం ఏమిటి అంటే ఉభయ కుశలోపరి అని అంటున్నారు. ఇదిలా ఉంటే బీజేపీకి ప్రాణ అవసరంగా మారిన మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయాలని పవన్ ని అమిత్ షా ఈ భేటీలో కోరారని అంటున్నారు.
దానికి పవన్ కళ్యాణ్ అంగీకరించారని తెలుస్తోంది. మహారాష్ట్రలో ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ప్రచారానికి ఈ నెల 18 దాకా గడువు ఉంది. అంటే కచ్చితంగా పది రోజులు సమయం ఉంది అన్న మాట. దాంతో కీలక నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. ముఖ్యంగా తెలుగు వారు ఉన్న చోట పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది అని ఆలోచిస్తున్నారుట.
ఈ మేరకు ప్రచారానికి పవన్ డేట్స్ ని చెప్పాలని అమిత్ షా కోరారని అంటున్నారు. దానికి అంగీకరించిన పవన్ తన డేట్స్ ని ఇసానని అన్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి అమిత్ షాకు పవన్ వివరించారు అని అంటున్నారు. ఆ విషయాలు అన్నీ ఓపికగా అమిత్ షా విన్నారని అంటున్నారు.
అదే సమయంలో తన శాఖకు సంబంధించి రూరల్ డెవలప్మెంట్ కోసం చేస్తున్న కృషిని కూడా అమిత్ షాకు పవన్ వివరించారని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ భేటీ పరస్పర ప్రయోజనాలు అన్నట్లుగా సాగింది అంటున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే లాభం ఉంటుందని కాషాయ దళం భావిస్తోంది. పవన్ పాపులర్ ఫిల్మ్ స్టార్. అంతే కాదు ఆయన సనాతన ధర్మం గురించి కూడా ఇటీవల కాలంలో ప్రస్తావించారు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నేపధ్యంలో దేశమంతా పవన్ వ్యాఖ్యలు గురించి చర్చ సాగింది. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కి కొత్త ఇమేజ్ ఈ సనాతన వాదంతో ఏర్పడుతునని భావిస్తున్నారు. దాంతో పవన్ కూడా బీజేపీ పెద్దల కోరికను మన్నిస్తున్నారు అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రచారం చేసిన వారిలో ఎన్టీఆర్ ప్రముఖంగా కనిపించేవారు. ఆ తరువాత చంద్రబాబు కూడా అవసరం అయిన సందర్భాలలో ఇతర రాష్ట్రాలలో ఆయా పార్టీల తరఫున ప్రచారం చేసేవారు.
ఇపుడు పవన్ కళ్యాణ్ కూడా అదే వరసలో తనదైన శైలిలో చేసే ప్రచారం ద్వారా జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్రను పోషిస్తున్నారు అని అంటున్నారు.