"ఆంధీ కళ్యాణ్"... మరాఠాలో పవన్ స్పీచ్ వీడియో వైరల్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఆయన అభిమానులకు, కార్యకర్తలకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
By: Tupaki Desk | 16 Nov 2024 11:42 AM GMTగతంలో ఇంగ్లిష్, హిందీ తోపాటు కన్నడ, తమిళ భాషల్లో మాట్లాడిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా ఆయన అభిమానులకు, కార్యకర్తలకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో భాగంగా... మహారాష్ట్ర వేదికగా మరాఠాలో తనదైన శైలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ సమయంలో ఎన్డీయే అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ శనివారం మహారాష్ట్ర చేరుకున్నారు.
ఈ సందర్భంగా డెగ్లూర్ లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. మరాఠీలో ప్రసగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇది కచ్చితంగా బిగ్ సర్ ప్రైజ్ అని అంటున్నారు నెటిజన్లు.
ఈ సందర్భంగా మైకందుకున్న పవన్ కళ్యాణ్... జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ప్రారంభించారు. ఈ సందర్భంగా... ఇది ఛత్రపతి శివాజీ పరిపాలించిన భూమి, ఇది ఆయన నడిచిన నేల, ఇంతటి వీరత్వం కలిగిన గడ్డ మహారాష్ట్ర అంటూ కొనసాగించారు. మరాఠా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు.
తాను.. మరాఠా వీరులకు నివాళి అర్పించడానికి, ఆ యోధుల పోరాటాలు గుర్తు చేసుకోవడానికి.. శివాజీ మహరాజ్ పాలనను, స్వాతంత్ర సమరయోధుల స్పూర్తిని గుర్తు చేసుకోవడానికి వచ్చానని.. అంబేద్కర్ జన్మించిన నేలపై నివాళులు అర్పించడానికి వచ్చానే తప్ప.. ఓట్లు అడగడానికి రాలేదని అన్నారు.
ఎన్డీయే ప్రభుత్వ హయాంలో డెగ్లూరులో ఎంతో అభివృద్ధి జరుగుతోందని.. ప్రతీ ఇంటికీ తాగునీటి సౌకర్యం, హేమద్వంతి ఆలయ అభివృద్ధి జరుగుతోందని.. అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని.. డెగ్లూర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్డీయే సభ్యుడి విజయం ఎంతో అవసరం అని అన్నారు.
అంతకముందు మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ మాట్లాడుతూ... ఇవాళ డెగ్లూర్ కు వచ్చింది పవన్ కల్యాణ్ కాదని.. ‘ఆంధీ కళ్యాణ్’ (తుపాను
కళ్యాణ్) అని అభివర్ణించారు.