Begin typing your search above and press return to search.

పవన్ అనవసరంగా రచ్చ చేసుకుంటున్నారా ?

జనసేన అధినేత పవన్ తొలిసారి గెలిచారు. తన పార్టీ ఎమ్మెల్యేలను 21 మందిని అసెంబ్లీకి పంపించుకోగలిగారు.

By:  Tupaki Desk   |   17 March 2025 7:00 PM IST
పవన్ అనవసరంగా రచ్చ చేసుకుంటున్నారా ?
X

జనసేన అధినేత పవన్ తొలిసారి గెలిచారు. తన పార్టీ ఎమ్మెల్యేలను 21 మందిని అసెంబ్లీకి పంపించుకోగలిగారు. ఇద్దరిని పార్లమెంట్ మెట్లు ఎక్కించగలిగారు. ఒక విధంగా పదేళ్ళ ప్రస్తానంలో ఒక విధంగా ఇది ఒక అచీవ్ మెంట్ గాన చూడాల్సి ఉంది. అయితే ఇంతటితో చాలదు. లక్ష్యం చాలా దూరంలో ఉంది. జనసేనకు ఈ రోజుకీ ఏపీ మొత్తం మీద ఆరెడు శాతం మించి ఓటు షేర్ లేదు.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అన్నింటిలో పార్టీని పటిష్టంగా చేసుకోవాలి. గ్రాస్ రూట్ లెవెల్ వరకూ పార్టీని ముందుకు తీసుకుని పోవాలి. పార్టీ కమిటీలు అన్నీ కూడా అన్ని చోట్లా ఉండాలి పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలి. ఇక ఏపీలో టీడీపీ వైసీపీకి చెరి 40 శాతం ఓటింగ్ షేర్ ఉంది. జనసేన ఆ స్థాయికి చేరుకోవాలీ అంటే ఎంతో కష్టపడాలి.

ఎపుడూ పొత్తు మంత్రాలు కుదరవు. అంతే కాదు, ముఖ్యమంత్రి పీఠం కాపులకు దక్కాలన్న ఒకే ఒక ఆశయంతోనే జనసేన వెనక బలమైన సామాజిక వర్గం ఉంది. ఆ వర్గం పవన్ ని సీఎం గా చూడాలని చూస్తోంది. ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా వారు ఉన్నారు. అయితే ఏపీలో కూటమి మరో పది పదిహేనేళ్ళు అధికారంలో ఉండాలని పవన్ ఇస్తున్న ప్రకటనలు వారిని నిరాసలోకి నెడుతున్నాయి.

రాజకీయాల్లో టైమింగ్ ముఖ్యం. అలాగే చాన్స్ కోసం వేచి ఉండడం కాదు క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మిత్రులు ఎవరూ శాశ్వతంగా ఉండరు. అందువల్ల సుదీర్ఘ కాలం పాటు పొత్తులతో వెళ్తాం జూనియర్ పార్టనర్ గా ఉంటామన్నట్లుగా ఏ పార్టీ చేసినా అది ఎదుగుదలకు ఏ మాత్రం దోహదం చేయదు. ఇపుడు చేతిలో అధికారం ఉంది పార్టీని చక్కదిద్దుకుని 2029 ఎన్నికల్లో సీఎం పీఠాన్ని పట్టేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా సీరియస్ గా ఫోకస్ పెట్టాలి.

దానికి ఎన్నో వ్యూహాలు అవసరం. ఆ దిశగా పవన్ కానీ జనసేన కానీ అడుగులు వేయాలని అంతా కోరుతున్నారు. అయితే పవన్ మాత్రం సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు. తమిళనాడు హిందీ వద్దు అంటే దాని మీద ఆయన కౌంటర్లు వేస్తున్నారు.

దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీల మీద బీజేపీ తరహాలో విరుచుకుపడుతున్నారు. దాంతో అటు వైపు నుంచి కూడా ఆయనకు గట్టి కౌంటర్లు పడుతున్నాయి. అసలు పవన్ కి ఇవన్నీ అవసరమా అన్న చర్చ వస్తోంది. ఏపీ రాజకీయ అవకాశాలను వాడుకుంటూ పార్టీ అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేయాల్సి ఉందని అంటున్నారు.

జనసేన భారీ లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి సాకారం కోసం పనిచేయాలని అంటున్నారు. హిందూత్వ ఫిలాసఫీ మంచిదే కానీ బీజేపీ అజెండాను మోస్తున్నట్లుగా పవన్ మీద విమర్శలు రావడాన్ని ఆ పార్టీ హితైషులు తట్టుకోలేకపోతున్నారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ ఈ రోజుకీ అందరి పార్టీగా ఆమోదం తీసుకోవడానికి కష్టపడుతోంది.

అలాంటిది ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన అందరి ఆమోదం కోసం గట్టిగా పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారు. ముందే గిరిగీసుకుని కూర్చోవడం అన్నట్లుగా చేస్తే నష్టమే వస్తుందని అంటున్నారు. తెలుగుదేశం బీజేపీకి మద్దతు ఇస్తొంది. కానీ ఆ పార్టీ వీర హిందూత్వ అజెండాను భుజాన వేసుకోవడం లేదని గుర్తు చేస్తున్నారు. అలాగే తమిళనాడు ఇష్యూలో టీడీపీ పెద్దగా మాట్లాడింది లేదని అంటున్నారు.

జనసేన విషయం తీసుకుంటే ఎన్నో అడుగులు వేయాల్సి ఉందని అంటున్నారు. పవన్ ఆలోచనల మీద ఆయన అడుగుల మీద బలమైన సామాజిక వర్గంతో పాటు ఎంతో మంది ఆశ పెట్టుకుని ఉన్నారని అంటున్నారు. మరి పవన్ కానీ జనసేన వ్యూహకర్తలు కానీ ఈ విషయంలో ఎంతవరకూ ఆలోచించి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు అన్నది చూడాల్సి ఉంది.