కేంద్రానికి పవన్ లేఖ.. మోడీని ఇరికించడమేనా... !
ఎందుకంటే..ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు.. విశాఖ పోర్టుకు టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలతోకూడిన షిప్పు ఒకటి వచ్చింది.
By: Tupaki Desk | 30 Nov 2024 1:30 PM GMTకాకినాడ పోర్టు అత్యంత ప్రమాదకరంగా మారిపోయిందని.. ఎక్కడ నుంచి ఎప్పుడు ఎలాంటివి ఇక్కడ దిగుమతి అవుతాయో.. చెప్పలేని పరిస్థితి నెలకొందని కూడా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దీనిపై తాను కేంద్రంలోని హోం శాఖకు, ప్రధాన మంత్రికి కూడా లేఖ రాస్తానని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు ను సంస్కరించాల్సి ఉందన్నారు. పవన్ ఆలోచన మంచిదే కావొచ్చు. కానీ, పవన్ చెబుతున్నట్టు కాకినాడ పోర్టు మాత్రమే భ్రష్టు పట్టిందా? అనేది సమస్య.
ఎందుకంటే..ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు.. విశాఖ పోర్టుకు టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలతోకూడిన షిప్పు ఒకటి వచ్చింది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున యాగీ జరిగింది, రాజకీయ వాదు లాటలు.. విమర్శలు కూడా జరిగాయి. ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా కూడా మారిపోయింది. తామువచ్చాక.. దీని అంతు చూస్తామని అప్పట్లోనే పవన్ చెప్పారు. కానీ, ఏంజరిగింది.. ``ఇది మా వ్యవహారం.. మీకు సంబంధం లేదు`` అని భారత నేవీ అధికారులు ఏపీకి లేఖ రాశారు.
ఆ తర్వాత.. పోర్టులో ఎలాంటి చర్యలు చేపట్టారో కూడా తెలియదు. కట్ చేస్తే.. రెండు రోజుల కిందట కూడా విశాఖ ఓడరేవుకు 1500 కిలోల మాదక ద్రవ్యాలు వచ్చాయి. ఇక, మహారాష్ట్రలోని బాంద్రా ఓడరేవు విషయంలోనూ పరిస్థితి ఇలానే ఉంది. అక్కడ ఏడాది కిందట ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు.. మాదకద్రవ్యాల కేసులో చిక్కుకున్నాడు. సముద్రంలోనిఓ ఓడలో అతను పార్టీ ఇస్తుండగానే అధికారులు అరెస్టు చేశారు. ఇది పెను సంచలనంగా.. దేశవ్యాప్త చర్చగా కూడా మారింది.
కానీ,తర్వాత ఈ కేసు ఏమైందో తెలియదు. కానీ, షారుఖ్ కుమారుడు సచ్చీలుడిగా బయట పడ్డాడు. ఆయ న పై కేసు కొట్టేశారు. అంటే.. ఇక్కడ పవన్ తెలుసుకోవాల్సింది.. పోర్టుల వ్యవహారంలో జాతీయస్థాయిలో పెద్ద తలకాయలు,కార్పొరేట్ వ్యక్తులే ఉన్నారు. ఇది కేవలం ఏ ఒక్క వ్యక్తికో.. శక్తికో సంబంధించిన వ్యవ హారం కాదు. అయినా.. ఆయనలేఖ రాస్తానని చెబుతున్నారు. మంచిదే. కానీ, ఈ లేఖ ద్వారా ఆయనకు ఒనగూరే ప్రయోజనం ఇప్పటికిప్పుడు తక్షణ మార్పులు వచ్చే అవకాశం అయితే ఏమీ కనిపించడం లేదన్నది వాస్తవం. పైగా .. మోడీని ఇరికించడమే అవుతుందని అంటున్నారు పరిశీలకులు..