Begin typing your search above and press return to search.

లోకేశ్, పవన్ భాయి... భాయీ.. డిప్యూటీ సీఎం లొల్లి ఉత్తిదేనా?

కూటమి ప్రభుత్వంలో చిచ్చు రేగుతోందంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని మరోసారి తేలిపోయింది.

By:  Tupaki Desk   |   26 Jan 2025 12:08 PM GMT
లోకేశ్, పవన్ భాయి... భాయీ.. డిప్యూటీ సీఎం లొల్లి ఉత్తిదేనా?
X

కూటమి ప్రభుత్వంలో చిచ్చు రేగుతోందంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులేనని మరోసారి తేలిపోయింది. ఇటీవల కాలంలో కూటమిలో ముఖ్యనేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత లోకేశ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వాగ్యుద్ధానికి ఎండ్ కార్డ్ పడింది. ఇక ఈ ఇద్దరు నేతలు రిపబ్లిక్ డే పరేడ్ లో కలుసుకోవడం, మనసువిప్పి మాట్లాడుకోవడంతో ఇరుపార్టీల కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.

రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా యువనేత లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుసుకున్నారు. ఇద్దరూ హాయిగా నవ్వుతూ మాట్లాడుకోవడంతో ఇటీవల జరగుతున్న ప్రచారం ఆ ఇద్దరి సంబంధాల్లో ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టమైంది. కూటమిలో ప్రస్తుతం జనసేనాని పవన్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ యువనేత, రాష్ట్ర ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి లోకేశ్ కు డిప్యటీ సీఎం హోదా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే మొదలైన ఈ డిమాండ్.. దావోస్ వేదికగా కాబోయే సీఎం అనే వరకు వెళ్లింది.

ఈ తరహా మాటలు కూటమిలో గ్యాప్ పెంచుతాయనే ఉద్దేశంతో ఇరుపార్టీల అధిష్ఠానాలు.. ఈ విషయంలో ఎవరూ మాట్లాడొద్దంటూ హుకుం జారీచేయడంతో ఆగిపోయాయి. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరు నేతల అభిమానులు మాత్రం వాదోపవాదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీనివల్ల భవిష్యత్లో ఇబ్బందులు తప్పవని కూటమిలో భయాందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు నేతలు ఓ చోట కలుసుకోవడం, హాయిగా మాట్లాడుకోవడం.. మేమిద్దరం ఒక్కటిగానే ఉన్నామనే సంకేతాలివ్వడంతో వివాదం కాస్త టీ కప్పులో తుఫాన్ లా సమసిపోయిందంటున్నారు.