మోడీతో పవన్ ఏమి చర్చించారు ?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వన్ టూ వన్ గా భేటీ జరిపారు జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
By: Tupaki Desk | 28 Nov 2024 3:34 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వన్ టూ వన్ గా భేటీ జరిపారు జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దాదాపుగా అర గంట పాటు ఈ భేటీ సాగిందని అంటున్నారు. ఈ భేటీ అనంతరం పవన్ ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కలిసారు. అలాగే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా కలిశారు పవన్ మోడీతో జరిపిన భేటీ వివరాలను వారు తెలుసుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఎన్డీయేలో అతి ముఖ్యమైన బాధ్యతలు పవన్ కి మోడీ అప్పగించబోతున్నారు అని అంటున్నారు.
ఆయనను ఎన్డీయేలో కీలకంగా చేస్తూ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను ఎన్డీయే కన్వీనర్ గా చేసి అప్పగిస్తారని కూడా అంటున్నారు. ఎన్డీయేకు కన్వీనర్ అయితే ఇప్పటి దాకా లేరు.
కానీ ఇపుడు ఆ పదవిని పవన్ కి ఇస్తారని అంటున్నారు. అలాగే పవన్ కి సౌత్ ఇండియాలో ఎన్డీయేని మరింత బలోపేతం చేసే విధంగా బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. ఈ భేటీ చాలా చక్కగా సాగిందని అంటున్నారు. ప్రధానితో భేటీ తరువాత పవన్ ట్వీట్ చేస్తూ తన హర్షం వ్యక్తం చేయడాన్ని కూడా అంతా గమనించారు. మరో వైపు చూస్తే ఏపీకి సంబంధించిన సమస్యలను కూడా పవన్ ప్రధానితో చర్చించారని అంటున్నారు.
అలాగే జాతీయ స్థాయిలో అనేక అంశాలు కూడా ప్రస్తావన వచ్చి ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉంటే 2022 నవంబర్ లో విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నేవీ అతిధి గృహంలో పవన్ ని రప్పించుకుని వన్ టూ వన్ భేటీ వేశారు. ఆ తరువాత రెండేళ్లకు సరిగ్గా నవంబర్ నెలలోనే ప్రధాని తో పవన్ భేటీ కావడం అది కూడా ముఖా ముఖీ కావడం విశేషమని అంటున్నారు.
ఇక ఆనాడు జనసేన అధినేతగా మాత్రమే పవన్ ఉన్నారు. ఇపుడు ఏపీలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అంతే కాదు జాతీయ స్థాయిలో బీజేపీకి విస్తృతంగా ప్రచారం చేసి పెట్టి అఖండ విజయాన్ని సాధించి పెట్టిన నేపధ్యంలో సరికొత్త ఇమేజ్ తో పవన్ మోడీని కలిశారు అని అంటున్నారు.
పవన్ వంటి చర్మిష్మాటిక్ లీడర్ ని రానున్న రోజులలో ఎన్డీయేని పటిష్టం చేసుకోవడానికి వినియోగించుకుంటూనే పవన్ ని కూడా రాజకీయంగా ముందుకు తీసుకుని వెళ్ళేందుకు ఉభయ కుశలోపరిగా బీజెపీ పెద్దలు వ్యూహాన్ని రచించారు అని అంటున్నారు. కేంద్రంలోని బీజెపీ పెద్దల వల్ల పవన్ పలుకుబడి అలా పెరిగిపోతోంది. ఆయన మీద నమ్మకం కూడా వారికి ఎక్కువగా ఉంది. దాంతో రానున్న రోజులలో పవన్ కి ఏ బాధ్యతలు అప్పగిస్తారో అని అంతా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో పవన్ జాతీయ స్థాయిలో మరింత కీలకం కానున్నారు అని అంటున్నారు.