డిప్యూటీ సీఎం పవన్... కొత్త ఏడాది సరికొత్త ప్లాన్ తో !
ఈ పర్యటనలకు మంచి ఆదరణ దక్కడంతో కొత్త ఏడాది నుంచి కనీసం నెలకు ఒక జిల్లా వంతున ఆయన పర్యటించాలని నిర్ణయించుకున్నారు అంటున్నారు.
By: Tupaki Desk | 29 Dec 2024 3:59 AM GMTఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాదికి ఆయన తీసుకున్న సరికొత్త నిర్ణయంగా కూడా దీనిని చూడాల్సి ఉంటుంది. కొత్త ఏడాదిలో తన అధికారిక పర్యటనలను ఆయన షెడ్యూల్ చేసుకున్నారు.
ఈ మేరకు టూర్లకు సంబంధించిన కాలెండర్ ని కూడా రెడీ చేయమని తన మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కొత్త ఏడాది నుంచి జనం మధ్యలోకి వెళ్లడానికి పవన్ ప్లాన్ పక్కాగా చేసి పెట్టుకున్నారు.
ముఖ్యంగా వెనకబడిన జిల్లాలలో పవన్ టూర్ సాగనుంది అని అంటున్నారు. అంతే కాదు ఆయన గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా పర్యటించేలా రూట్ మ్యాప్ ని రెడీ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ప్రజలతో మమేకం కానున్నారని అంటున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉత్తరాంధ్రాలో జరిపిన రెండు రోజుల పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. ఆయన ఏజెన్సీ ప్రాంతాలను ఎంచుకుని అక్కడ గిరిజనంతో కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన అనేకమైనవి ప్రారంభించారు. ఆ విధంగా జనం మద్దతు మన్నన అందుకున్నారు
ఈ పర్యటనలకు మంచి ఆదరణ దక్కడంతో కొత్త ఏడాది నుంచి కనీసం నెలకు ఒక జిల్లా వంతున ఆయన పర్యటించాలని నిర్ణయించుకున్నారు అంటున్నారు. అంతే కాదు ఆయన జిల్లాలలోనే పవన్ బస చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు
క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికే పవన్ ఈ పర్యటనలు చేస్తున్నారు అని అంటున్నారు. జనంతో ఉంటే వారితో మమేకం అయితే అనేకమైన సమస్యలు తెలుస్తాయి. అలాగే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తోంది అన్నది కూడా డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ అవుతుంది. అంతే కాదు ఏ విధంగా పనిచేయాలని జనాలు కోరుకుంటున్నారు. వారి ఆకాంక్షలు ఏమిటి అన్నది కూడా వెల్లడి అవుతుంది.
పైగా ప్రభుత్వ పెద్దలు జనం మధ్యకు వస్తున్నారు అంటే చాలా సమస్యలకు అక్కడికక్కడ పరిష్కారం లభిస్తాయి. ఆ విధంగా పవన్ జిల్లా పర్యటనలు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి అంటున్నారు. అంతే కాదు రాజకీయంగా కూడా జనసేనకు ఇది లాభంగా మారుతుంది అని కూడా అంటున్నారు.
అధికారంలో ఉన్న వారు సాధారణంగా తిరగడానికి ఇష్టపడరు. కానీ పవన్ అలా కాకుండా జిల్లా పర్యటనలకు తొలి ఆరు నెలల తరువాత నుంచే శ్రీకారం చుడుతున్నారు. ఇది లాంగ్ టెర్మ్ లో కూటమి ప్రభుత్వానికి మేలు చేస్తుంది అని అంటున్నారు తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే వాటిని మధింపు చేసి చక్కదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని అంటున్నారు.
ప్రతీ జిల్లాకూ కొన్ని ప్రత్యేక సమస్యలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న తీరు తెన్నులను కూడా గమనించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాల మీద కూడా జనం నుంచి తెలుసుకునే వీలు ఉంటుంది. ఇలా అన్నీ ఆలోచించే పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు అని అంటున్నారు.