'వెరీ స్ట్రేంజ్'... పవన్ వచ్చినప్పుడల్లా సెలవులో కాకినాడ ఎస్పీ!!
అనంతరం... "వెరీ స్ట్రేంజ్.. ఎస్పీ టెక్స్ ది లీవ్.. ఎగ్జాట్లీ నేను వచ్చే సమయానికి ఎస్పీ సెలవు తీసుకుని ఉంటాడు.. బాగుంది కదా!?" అంటూ పవన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు!
By: Tupaki Desk | 29 Nov 2024 12:58 PM GMTకాకినాడలోని పోర్ట్ నుంచి రేషన్ బియ్యం భారీగా అక్రమ రవాణా జరుగుతుందనే విషయం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. తాజాగా పోర్టుని సందర్శించిన ఆయన.. సముద్రంలోకి వెళ్లి మరీ నౌకలు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఇదే సమయంలో... నాయకులు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ చర్యలు చేపట్టరా అంటూ అధికారులను నిలదీశారు.
కళ్లముందు కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై పవన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ ను పవన్ నిలదీశారు. ఇదే సమయంలో... తన పర్యటనలో ఎస్పీ కనిపించకపొవడంపై పవన్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.
అవును... ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా వ్యవహారాన్ని తనిఖీ చేశారు! ఈ సందర్భంగా అధికారులపై మండిపడ్డారు. ఈ సమయంలో... అక్కడ కాకినాడ ఎస్పీ కనిపించకపోవడంపై స్పందించారు. ఈ సందర్భంగా తొలుత.. "ఎస్పీ కనిపించడు ఎక్కడ?" అని పవన్ ప్రశ్నించారు.
అనంతరం... "వెరీ స్ట్రేంజ్.. ఎస్పీ టెక్స్ ది లీవ్.. ఎగ్జాట్లీ నేను వచ్చే సమయానికి ఎస్పీ సెలవు తీసుకుని ఉంటాడు.. బాగుంది కదా!?" అంటూ పవన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు! దీంతో... పవన్ కాకినాడ పర్యటన సమయాల్లో, ప్రధానంగా తనిఖీల పర్యటనల్లో ఎస్పీ లీవ్ తీసుకుంటున్నారా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా... కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్ గా మార్చారని.. ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైనదని.. అయితే, ఇక్కడ సిబ్బంది కేవలం 16 మంది మాత్రమే అని.. దీనిపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా తో మాట్లాడతానని పవన్ కల్యాణ్ తెలిపారు.