Begin typing your search above and press return to search.

పల్లెలు చల్లగా...పవన్ వ్యూహం అదుర్స్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు అదుర్స్ అని అంటున్నారు. ఆయన అనుకున్నది పక్కాగా చేసుకుని వెళ్తున్నారు.

By:  Tupaki Desk   |   15 Oct 2024 2:30 PM GMT
పల్లెలు చల్లగా...పవన్ వ్యూహం అదుర్స్!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు అదుర్స్ అని అంటున్నారు. ఆయన అనుకున్నది పక్కాగా చేసుకుని వెళ్తున్నారు. 2014లో పోటీ చేయకుండా హుందాతనం పాటించడం ద్వారా పొలిటికల్ గా కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశారు.

ఇక ఆయన 2019లో పోటీ చేయడం వెనక కూడా వ్యూహాలు కాదనలేనివే. సొంతంగా తమ బలం ఏమిటో చూపించారు. తద్వారా తాను లేని టీడీపీ ఎలా ఓడుతుందో కళ్ళకు కట్టారు. దాని ఫలితమే 2024లో ఎన్నికల్లో టీడీపీ కూటమి ఏర్పాటు అయింది. పవన్ కి కీలకమైన పాత్ర కూడా లభించింది. గెలిచిన తరువాత ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ చంద్రబాబుతో సరిసమానంగా గౌరవం అందుకుంటున్నారు.

ఇక అధికారంలోకి వచ్చినా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలోనే గెలుపు ఉంది. ఎమ్మెల్యేలు ఉన్నారు. వాటిని దాటి 154 సీట్లలో ఆయన తన పార్టీని విస్తరించాల్సి ఉంది. దాంతో పవన్ తన అధికారాన్ని ఒక పద్ధతి ప్రకారమే వాడుకుంటున్నారు. నిజానికి పవన్ హోం శాఖ తీసుకుంటారని అంతా భావించారు. కానీ పవన్ అనూహ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను తీసుకున్నారు.

ఆ విధంగా ఆయన తన స్ట్రాటజీ అక్కడే అమలు చేశారు. జనసేన అధినేతకు అపరిమితమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే బలమైన సామాజిక వర్గం అండ ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో పార్టీ గట్టిగా లేదు. ఇపుడు ఆ లోటుని తీర్చుకోవడానికే ఆయన ఫోకస్ పెడుతున్నారు. ఆయన తన దగ్గర ఉన్న పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పల్లెల మీద దృష్టి పెడుతున్నారు.

గతంలో గ్రామ సభలు ఓకేసారి నిర్వహించి జాతీయ ఉపాధి హామీ పనుల మీద తీర్మానం చేయించి ప్రపంచ రికార్డుకు ఎక్కిన పవన్ ఇపుడు ఆయా పనులను ప్రారంభించడానికి పల్లె పండుగ పేరుతో వారం రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి తోడు అన్నట్లుగా కేంద్రం నుంచి దండీగా నిధుల వరద కూడా పారింది.

అంతే కాదు జాతీయ ఉపాధి హామీల పని దినాలకు కూడా కేంద్రం ఉదారంగా ఏపీకి భారీగా పెంచింది.దాంతో అటు పనులు గ్రామీణ ప్రజలకు దొరుకుతున్నాయి. మరో వైపు అభివృద్ధి జరుగుతోంది. ఈ రెండింటిలోనూ జనసేన అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ పాత్ర కీలకంగా ఉంది.

అందుకే ఆయన పల్లె పండుగ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం చేపడుతున్న పనులు అన్నీ సంక్రాంతి నాటికి పూర్తి కావాలని కోరారు. ఆ విధంగా పూర్తి చేస్తే అపుడు మరిన్ని పనులలతో మలి విడత పల్లె పండుగను ప్రారంభిద్దామని చెప్పుకొచ్చారు.

ఈ పనుల ద్వారా గ్రామాలలో రోడ్డు, డ్రైనేజ్ ఇతర మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. దాంతో పల్లె జనాలు ఫుల్ హ్యాపీస్ గా ఉంటారు. అదే సమయంలో సర్పంచులు కూడా పవన్ పట్ల ఎంతో కృతజ్ఞతగా ఉంటారు. వారి చేతిలో నిధులు విధులూ అన్నీ వచ్చాయి. దాంతో వారంతా కూడా జనసేన వైపు టర్న్ అవుతారు

దీంతో పల్లెసీమలో జనసేనకు బలం ఆటోమేటిక్ గా పెరుగుతుందని పవన్ భావిస్తున్నారు. పవన్ చంద్రబాబు స్పూర్తిగా టీడీపీ కూటమిలో ఉంటూ జగన్ ని తన అసలైన ప్రత్యర్ధిగా చూస్తున్నారు. వైసీపీని గ్రామాలలో పట్టు ఉంది. ఫ్యాన్ పార్టీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 40 శాతం ఓటు షేర్ కూడా అక్కడ నుంచే వచ్చింది.

రానున్న ఎన్నికల్లో వైసీపీతో తలపడాలి. ఫ్యూచర్ పాలిటిక్స్ అంతా పవన్ జగన్ ల మధ్యనే సాగుతుంది అన్న అంచనా అయితే పవన్ కి ఉందని అంటున్నారు. దాంతో కోరి మరీ వైసీపీ గ్రాస్ రూట్ లెవెల్ బలాన్ని తగ్గిస్తూ ఆ మేరకు జనసేనను పెంచే సరికొత్త వ్యూహానికి పవన్ పదును పెడుతున్నారు అని అంటున్నారు. సో పల్లె కడుపు చల్లగా అని పవన్ గురించి పాడుకోవాల్సిందే మరి.