Begin typing your search above and press return to search.

పవన్ సీజ్ ది షిప్....అక్కడే బిగ్ ట్విస్ట్ !

సీజ్ ది షిప్. ఈ డైలాగ్ ఇటీవల పాపులర్ అయింది. అవును మరి అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

By:  Tupaki Desk   |   20 Dec 2024 3:34 AM GMT
పవన్ సీజ్ ది షిప్....అక్కడే బిగ్ ట్విస్ట్ !
X

సీజ్ ది షిప్. ఈ డైలాగ్ ఇటీవల పాపులర్ అయింది. అవును మరి అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతే కాదు జన హృదయాలను గెలుచుకున్న జనసేనాని. ఆయన నోట అంతటి పవర్ ఫుల్ వర్డ్ వచ్చిందంటే అది తెలుగు నాట డైలాగ్ కా బాప్ అయి తీరుతుంది. అదే జరిగింది కూడా.

సీజ్ ది షిప్ పేరుతో సినిమా తీసేందుకు టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారు అన్న ప్రచారమూ సాగింది. అంతటి పవర్ ఫుల్ డైలాగ్ తో పవన్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో సంచలనమే రేపారు. లేకపతే ఒక వైపు పెంగాల్ తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్న వేళ బోట్లలో నడి సముద్రంలోకి వెళ్ళి మరీ సీజ్ ద షిప్ అనగలిగే సాహసం సగటు రాజకీయ నేతకు ఎవరికైనా ఉండగలదా అన్నదే ప్రశ్న.

అయితే పవన్ సీజ్ ద షిప్ అన్నారు. కానీ ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది మాత్రం ఇప్పటిదాకా తెలియదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు ఎంతవరకూ ఉన్నాయి. షిప్ ని సీజ్ చేసే రైట్స్ ఉన్నాయా అన్న చర్చ కూడా సాగింది.

దాంతో పాటుగా కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా రవాణా అయిపోతోంది అన్నది కూడా ఒక పెద్ద చర్చగా సాగింది. అక్రమార్కుల భరతం పడతామని కూడా కూటమి ప్రభుత్వం చెప్పింది. అయితే ఆ దిశగా యాక్షన్ జరిగిందా లేదా అన్నది కూడా ఎవరికీ తెలియదు.

ఈ నేపధ్యంలో ఇపుడు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటి అంటే సీజ్ ది షిప్ అంటూ షిప్ ని నిలిపివేయడం సరైనది కాదూ అంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ కోపరేటివ్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ తేల్చి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు అన్నది అయితే జనసేన సహా కూటమి నేతలు ప్రచారం చేశారు కానీ ఈ విషయం వైరల్ అయినంతగా ఈ కేసులో అయితే పెద్దగా విషయం లేదని కూడా అంటున్నారు.

లేటెస్ట్ గా అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న నేషనల్ కోపరేటివ్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ దీని మీద రియాక్ట్ అయింది అంటున్నారు. ఆకలిని నివారించడానికి ఆఫ్రికా దేశంతో చేసుకున్న జీటూజీ ఒప్పందానికి విఘాతం కలిగించవద్దు అంటూ నేషనల్ కోపరేటివ్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ ఏపీ ప్రభుత్వానికి అలాగే కాకినాడ కలెక్టర్ కి తాజాగా లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.

ఫోర్టిఫైడ్ రైస్ తాలూకా ఆనవాళ్ళు ఉన్నాయన్న కారణంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎగుమతి కాకుండా అడ్డుకోవడం సరైంది కాదని కూడా నేషనల్ కోపరేటివ్ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ స్పష్టం చేసింది అని అంటున్నారు. మొత్తానికి సీజ్ ది షిప్ కధ ఇలా బిగ్ ట్విస్ట్ తో ఎండ్ కార్డు పడేలా ఉందని అంటున్నారు.