Begin typing your search above and press return to search.

నోటి మాట కాదు పవన్...అట్లాగే ఉంటది...!

పవన్ కళ్యాణ్ సినీ నటుడు కం పొలిటీషియన్. ఆయన రాజకీయాల మీద పుసకాల ప్రభావంతో పాటు సినిమాల ప్రభావం చాలా ఉంటుందని అంటారు

By:  Tupaki Desk   |   4 Oct 2023 3:30 PM GMT
నోటి మాట కాదు పవన్...అట్లాగే ఉంటది...!
X

పవన్ కళ్యాణ్ సినీ నటుడు కం పొలిటీషియన్. ఆయన రాజకీయాల మీద పుస్తకాల ప్రభావంతో పాటు సినిమాల ప్రభావం చాలా ఉంటుందని అంటారు. సినిమాల్లో అయితే ఒక చోట నాయకుడి సభ జరిగితే ప్రత్యర్ధులు వెళ్ళి లొల్లి చేసి అక్కడ గలాభా క్రియేట్ చేసి మొత్తం డ్యామేజ్ చేస్తారు. అది సినిమా రీల్.

మరి రియల్ రీల్ లో అలా ఉంటుందా. ఇక్కడ రాజకీయ నాయకుల విధానాలలో ఏమైనా తేడాలు ఉంటాయి తప్ప బుగ్గ మీసాలతో బుగ్గ పక్కన పెద్ద గాటుతో గల్ల లుంగీతో రంగురంగుల జుబ్బాతో కనిపించరు కదా. ఇక పవన్ వారాహి యాత్ర తరువాత అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అన్నింటినీ వైసీపీ సర్కార్ లైట్ తీసుకుంది కానీ వాలంటీర్ల మీద సంఘ వ్యతిరేక ముద్ర వేసి ఒంటరి మహిళలను దేశం దాటించే వారితో లింక్ పెట్టి విమర్శించడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. దాని మీద కోర్టులో కూడా ఎవరో ఫిర్యాదు చేశారు.

ఆ మ్యాటర్ అలా ఉంటే తాను గోదావరి జిల్లాలో టూర్ లో ఉంటే తన సభలో పెద్ద ఎత్తున గూండాలు చొరబడి జనాలను చంపేసే కుట్రకు తెర తీశారని ఆ తరువాత పార్టీ నేతలతో మాట్లాడుతూ మరో సందర్భంలో పవన్ చెప్పారు. దీనికి కూడా వైసీపీ సర్కార్ నుంచి పెద్దగా రియాక్షన్ లేదు, మంత్రుల స్థాయిలో అయితే ఖండనలు వచ్చాయి.

ఇపుడు పెడన మీటింగులో వైసీపీ గూండాలు వేలాదిగా చొరబడి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నారు అని బాంబు లాంటి వార్తనే పవన్ పేల్చారు. అంతే కాదు రాళ్ళతో దాడి చేయిస్తారని, గొడవలకు పక్కా ప్లాన్ తో ఉన్నారని కూడా ఆయన అన్నారు.

తనకు ఏమైనా జరిగితే సీఎం జగన్ ది డీజీపీదే బాధ్యత అంటూ ఆయన హెచ్చరించారు కూడా. దాంతో ప్రభుత్వం ఉలిక్కి పడినట్లు అయింది. వెంటనే యాక్షన్ లోకి దిగిపోయింది కూడా క్రిష్ణా జిల్లాకు చెందిన ఎస్పీ జాషువా పవన్ కి నోటీసులు ఇచ్చారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించాలని అందులో కోరడం విశేషం.

ఆ మీదట ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కంటే కూడా తమ దగ్గర బలమైన నిఘా వ్యవస్థ ఉందని చెప్పడం గమనార్హం. అయితే పవన్ ఈ రకంగా తీవ్రమైన ఆరోపణలు ఎందుకు చేశారు, తరచూ ఎందుకు ఇలా ప్రభుత్వం మీద ఎందుకు చేస్తున్నారు అన్నది చర్చగా ఉంది. నిజానికి నన్ను చంపడానికి ఎవరో చూస్తున్నారు అని పవన్ అనడమూ పదే పదే జరుగుతూనే ఉంది.

ఏపీ రాజకీయాలు చూసుకున్నా దేశ రాజకీయాలు చూసుకున్నా రాజకీయ పార్టీ నేతల సభలకు ఎపుడూ ఇబ్బందులు లేవు, అలాగే వారిని అంతలా టార్గెట్ చేసి చంపేసిన ఘటనలు ఒక్కటి కూడా జరగలేదు. విమర్శలు అయితే తీవ్రంగా ఉంటాయి. మాటల దాడులు అయితే ఎక్కువగానే జరుగుతూంటాయి. కానీ పవన్ మాత్రం పదే పదే తమ ప్రాణాలకు ముప్పు అంటూంటారు.

పోనీ అది సానుభూతి కోసం అనుకున్నా ఇపుడు ఆయన ఏకంగా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ పెద్ద బండ వేశారు. నిజంగా అలా ఎవరూ చేయకపోవచ్చు. కానీ అసాంఘిక శక్తులు ఈ అవకాశాన్ని వాడుకుని రచ్చ చేస్తే అపుడు మొత్తం వ్యవహారం దారుణంగా ఉంటుంది. అందువల్ల ఏ చిన్న విమర్శ అయినా ఆరోపణ అయినా పోలీసులు అలెర్ట్ గానే ఉండాలి. బే ఫికర్ గా ఉండకూడదు.

ఇపుడు సరిగ్గానే పోలీసులు రియాక్ట్ అయ్యారనుకోవాలి. తమ పరిధిలో తాము నిఘాను పెంచుతూనే మీ దగ్గర ఆధారాలు ఉంటే తెచ్చి ఇవ్వండని నోటీసులు ఇచ్చారు. నిజానికి పవన్ కి దీని మీద సమాచారం ఉంటే పోలీసులతో పంచుకోవచ్చు. గొడవ జరిగితే సామాన్యులు అమాయక ప్రజలే బలి అవుతారు కాబట్టి ఆ విధంగా ప్రజా నేతగా ఆయన పోలీసులకు సహకరించాల్సిన బాధ్యతతోనే ఉన్నారు.

అలా కాకుండా ఆయన నోటి మాటగానే ఆరోపణలు చేసి ఉంటే మాత్రం అది ఆయన క్రెడిబిలిటీకే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. పవన్ కి క్రేజ్ ఉంది. ఆయన ఏమి చెప్పినా వినే జనాలు ఉన్నారు. ఇక్కడే రాజకీయ నేతగా పవన్ సహా ఎవరైనా జాగ్రత్త వహించాలి అని అంటున్నారు. సమాజంలో శాంతి కోసం అంతా పాటు పడాలి అదే సమయంలో ఇబ్బంది ఎక్కడైనా రాకుండా చూసుకోవాలి. రాజకీయాల్లో ఆవేశ కావేశాలు మాటలకే పరిమితం చేసుకోవాలి. మరి పవన్ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో పోలీసులకు ఇచ్చే నోటీసులలో ఏమి చెబుతారో చూడాలి.