ఆర్జీవీ కేసుపై పవన్ కల్యాణ్ ఆసక్తికర రియాక్షన్!
అవును... ఏపీలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన రామ్ గోపాల్ వర్మ "దౌడ్" వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు.
By: Tupaki Desk | 26 Nov 2024 4:44 PM GMTప్రస్తుతం ఏపీ వ్యవహారాల్లో అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ "రామ్ గోపాల్ వర్మ - ఏపీ పోలీసులు" వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఏపీ పోలీసులతో వర్మ "దొంగ - పోలీస్" ఆట ఆడుతున్నాడనే కామెంట్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఈ సమయంలో పవన్ స్పందించారు.
అవును... ఏపీలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన రామ్ గోపాల్ వర్మ "దౌడ్" వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు. ఈ సమయంలో ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఇందులో భాగంగా తన పని తాను చేస్తున్నానని.. పోలీసులు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇక లా అండ్ ఆర్డర్ హోంమంత్రి చూస్తారని పవన్ కల్యాణ్ బదులిచారు. ఇదే సమయంలొ.. చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడెందుకు తటపటాయిస్తున్నారనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే క్రమంలో... జగన్ కు అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన పవన్ కల్యాణ్... హోంశాఖ, శాంతిభద్రతలు తన పరిధిలో లేవని స్పష్టం చేశారు.
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్... కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... జలశక్తి మంత్రిగా షెకావత్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతగానో సహకరించారని అన్నారు.
ఇక.. ఏపీ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని తెలిపారు. ఏపీకి 975 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సముద్ర తీరం ఉందని.. గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. ఇదే క్రమంలో.. ఏపీలో టూరిజం యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. వీటిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పవన్ తెలిపారు.