Begin typing your search above and press return to search.

వామ్మో పవన్...పగ పడితే అంతే సంగతులా ?

అటు ద్వారంపూడితో పాటుగా అవినీతి అక్రమాలు చేసే వ్యాపర వర్గాలకు కూడా ఆయన గట్టి హెచ్చరికలు ఈ విధంగా జారీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 7:30 PM GMT
వామ్మో పవన్...పగ పడితే అంతే సంగతులా ?
X

పవన్ కళ్యాణ్ ని కేవలం సినిమా నటుడు అని చాలా మంది లైట్ తీసుకున్నారు. ఆయనకు రాజకీయాలు ఏమి తెలుసు అన్న వారూ ఉన్నారు. పవన్ జస్ట్ సెలిబ్రిటీ అని ఆయన రాజకీయ హడావుడి చేస్తున్నారు అని తలచిన వారు ఉన్నారు. కానీ పవన్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని 2024 ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

వైసీపీకి పాతాళం అంచులు చూపించేశారు. కేవలం 11 సీట్లలో వైసీపీ విపక్ష హోదాకు కూడా కాకుండా పోయింది. ఒకనాడు అసెంబ్లీ నిండా వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ నిండుగా సభలో కొలువు తీరేవారు. అటువంటి జగన్ ఈ రోజు అసెంబ్లీకి రావడం లేదు. ఇక ఈసారి అసెంబ్లీలో పవన్ సెంటర్ అట్రాక్షన్ అయ్యారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్ తన వారాహి యాత్ర సందర్భంగా ఏమేమి ప్రకటలను చేశారో ఎవరెవరిని టార్గెట్ చేశారో అలా ఒక్కొక్కరి మీద తన మూడో కన్ను తెరుస్తున్నారు అని అంటున్నారు. పవన్ 2023లో చేసిన వారాహి యాత్ర గోదావరి జిల్లాలలో హోరెత్తించింది.

ఈ సందర్భంగా ఆయన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఘాటు విమర్శలే చేశారు. కాకినాడ పోర్టుని అడ్డాగా చేసుకుని అవినీతి కార్యకలాపాలు సాగుతున్నాయని కూడా మండిపడ్డారు. ద్వారంపూడి అవినీతిని బయటపెట్టకపోతే తాను పవన్ కళ్యాణ్ నే కాను అని భీకర ప్రతిజ్ఞ కూడా ఆనాడు పవన్ చేశారు.

అయితే అపరిమితమైన అధికారంతో ఉన్న వైసీపీ నాడు దీనిని లైట్ తీసుకుంది. అంతే కాదు ద్వారంపూడి కూడా ముందు పవన్ ఎమ్మెల్యేగా గెలిస్తే కదా అని ఎకసెక్కమాడైన సందర్భాలు ఉన్నాయని అంటారు. ఇలా పవన్ ని వ్యక్తిగతగనా కూడా ద్వారంపూడి టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక కట్ చేస్తే 2024 ఎన్నికల్లో జనసేన 21కి 21 సీట్లు గెలుచుకుని వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది.

ఆ తరువాత పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తమ కోటాలో కేటాయించిన మంత్రులలో పౌర సరఫరాల శాఖను తీసుకోవడం వెనక కూడా వ్యూహం ఉంది అని అంటారు. ఇక ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత ఒకసారి వచ్చిన పవన్ కొద్ది రోజుల పాటు కాకినాడలోనే ఉండి ద్వారంపూడి చంద్రశేఖర్ కి సంబంధించిన అన్ని అంశాలను స్టడీ చేశారని అంటున్నారు.

కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిపోతున్న బియ్యం గురించి గుట్టూ మట్టూ పూర్తి స్థాయిలో లాగిన తరువాతనే ఆయన సముద్రంలోకి పడవల మీద వెళ్ళి సీజ్ ద షిప్ అని అనగలిగారు అని అంటున్నారు. ఇక చూస్తే పవన్ కళ్యాణ్ ఇదే ఇష్యూ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసి గడగడలాడిస్తున్నారు. అటు ద్వారంపూడితో పాటుగా అవినీతి అక్రమాలు చేసే వ్యాపర వర్గాలకు కూడా ఆయన గట్టి హెచ్చరికలు ఈ విధంగా జారీ చేస్తున్నారు.

ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గోదావరి జిల్లాలలో చాలా రైస్ మిల్లులను టార్గెట్ చేసుకుని విస్తృతంగా తనిఖీలు చేయడంతో పాటు వేయికి పైగా కేసులు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు కాకినాడ పోర్టు మీద కొరడా ఝళిపిస్తున్నారు.

ఒక ఐపీఎస్ అధికారితో కమిటీని నియమించడం ద్వారా ప్రభుత్వం సీరియస్ గానీ ఈ విషయం ఉందని స్పష్టం చేసింది. అంతే కాదు కాకినాడ‌లోని క‌ర‌ప‌లో ఉన్న వీర‌భ‌ద్ర ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన రొయ్య‌ల ఫ్యాక్ట‌రీని ఆగ‌స్టు 6నే పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు మూసివేసినని అంటున్నారు. అదే విధంగా చూస్తే లంప‌క‌లోవ‌లో ఉన్న మరో ఫ్యాక్టరీని కూడా ఈ మధ్యనే మూసి వేశారు. దీంతో అన్ని వైపుల నుంచి ద్వారంపూడికి దారులు మూసివేసి ఉక్కిరిబిక్కిరి చేశారని అంటున్నారు.

ఇంతే కాదు ద్వారంపూడికి చెందిన అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తునకు కూఒడా కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది అంటే దాని వెనక పవన్ పట్టుదల ఉందని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే పవన్ పగ పడితే ఎలా ఉంటుందో చూపించడానికే అని అంటున్నారు. పవన్ ప్రేమను చూసిన వారు అంతా ఉన్నారు. ఆయన పగను కూడా ఈ విధంగా చూసిన వారు ఇపుడు ఉండబోతున్నారు అని అంటున్నారు. మొత్తానికి పవన్ పట్టుదలను ఆయన ఆలోచనలను వ్యూహాలను ఎపుడూ తక్కువ అంచనా వేయవద్దు అని జరిగిన జరుగుతున్న సంఘటనలు అనేకం నిరూపిస్తున్నాయని అంటున్నారు.