పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్టేట్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన రెండవ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్ అప్టేట్ తెలిపారు.
By: Tupaki Desk | 10 April 2025 12:47 PMఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన రెండవ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్ అప్టేట్ తెలిపారు. సింగపూర్‌లో జరిగిన వేసవి శిబిరంలో అగ్ని ప్రమాదానికి గురైన మార్క్ శంకర్ ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగుపడిందని ఆయన వెల్లడించారు. దేవుడి దయ వల్ల మార్క్ ఇప్పుడు క్షేమంగా ఉన్నాడని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తన కుమారుడు త్వరగా కోలుకోవాలని పూజలు చేసిన.. ప్రార్థించిన జనసేన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సింగపూర్‌లో వేసవి శిబిరానికి వెళ్లిన సమయంలో మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ వెంట తల్లి అన్న లెజ్నేవా సింగపూర్‌లో ఉన్నారు. ఈ వార్త విన్న వెంటనే పవన్ కళ్యాణ్ తన అధికారిక పర్యటనను ముగించుకుని సింగపూర్‌కు వెళ్లారు. ఆయన వెంట అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ కూడా వెళ్లారు.
ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే మీడియా మార్క్ శంకర్ ప్రమాదానికి సంబంధించిన కథనాలతో నిండిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి అధికార , ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జనసైనికులు చిన్నారి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న మార్క్ మాస్క్‌తో ఉన్న దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా పవన్ కళ్యాణ్ స్వయంగా తన కుమారుడి ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పడంతో అభిమానులు.. జనసేన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. మార్క్ శంకర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.