Begin typing your search above and press return to search.

కోలుకున్న పవన్..12, 13, 14వ తేదీల్లో సౌత్ ఇండియా లో ఆలయాల సందర్శన!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్ సమస్యలతో బాధపడుతున్న పవన్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు

By:  Tupaki Desk   |   10 Feb 2025 11:17 AM GMT
కోలుకున్న పవన్..12, 13, 14వ తేదీల్లో సౌత్ ఇండియా లో ఆలయాల సందర్శన!
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్ సమస్యలతో బాధపడుతున్న పవన్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. అయితే జ్వరం తగ్గడంతోపాటు స్పాండిలైటిస్ సమస్య నుంచి కాస్త ఉపశమనం లభించడంతో పవన్ మళ్లీ తన దైనందన రాజకీయ కార్యకలాపాలకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 12 నుంచి దక్షిణ భారతదేశ యాత్రకు రెడీ అవుతున్నారు.

సనాతన ధర్మం, హైందవ ధర్మ పరిరక్షణ కోసమంటూ పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జ్వరం కారణంగా వాయిదా పడిన తమిళనాడు, కేరళ రాష్ట్రాల పర్యటనకు రెడీ అవుతున్నారు. ఈ నెల 5 నుంచి ఆయా రాష్ట్రాల్లో ఆలయాలను పవన్ సందర్శించాల్సిన అవసరం ఉంది. అయితే జ్వరం కారణంగా పవన్ ఐదు రోజుల పర్యటన తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం జ్వరం తగ్గడంతో మరో రెండు రోజుల్లో తన పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఆయన పార్టీ వర్గాలను ఆదేశించినట్లు సమాచారం.

పవన్ సూచనలతో 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో వివిధ దేవాలయాలను దర్శించుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నట్లు జనసేన వర్గాల సమాచారం. 12, 13, 14వ తేదీల్లో పవన్ ఆలయాల సందర్శన ఉంటుంది. కేరళలోని అనంతపద్మనాభ స్వామి, తమిళనాడులోని మధుర మీనాక్షి, శ్రీ పరుశ రామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలను పవన్‌ కల్యాణ్‌ దర్శించుకుంటారని జనసేన వర్గాలు తెలిపాయి.

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత పవన్ సనాతన ధర్మ దీక్ష చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చిన పవన్.. దక్షిణాదిలోని ప్రధాన ఆలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన పర్యటన కోసం హిందూ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ కార్యక్రమానికి మొత్తం ఐదు రోజులు కేటాయించాలని భావించినా, బిజీ షెడ్యూల్ రీత్యా మూడు రోజులకు కుదించుకున్నట్లు చెబుతున్నారు.