Begin typing your search above and press return to search.

పవన్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఏమిటీ 'స్పాండిలైటిస్'!

ఆయన వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

By:  Tupaki Desk   |   6 Feb 2025 6:56 AM GMT
పవన్  ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఏమిటీ స్పాండిలైటిస్!
X

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ సమయంలో.. పవన్ ను అంతలా ఇబ్బంది పెడుతున్న ఆ స్పాండిలైటిస్ ఏమిటి.. అది ఎంత ప్రమాదం.. అది ఎందుకు వస్తుంది.. మొదలైన చర్చలు తెరపైకి వచ్చాయి.

అవును... పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు డిప్యూటీ సీఎం ఆఫీస్ వెళ్లడించింది. ఈ సందర్భంగా.. ఆయన వైరల్ ఫీవర్ తో ఇబ్బందిపడుతున్నారని.. జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధపెడుతోందని.. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని.. వీటి మూలంగా గురువారం జరిగే రాష్ట్రం క్యాబినెట్ మీటింగ్ కు పవన్ కల్యాణ్ హాజరుకాకపోవచ్చని తెలిపింది.

దీంతో... పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. గతంలో ఆయన పలుమార్లు వెన్ను నొప్పితో బాధపడ్డారని.. ఈ సమయంలో ఆయనను అంతగా ఇబ్బంది పెడుతున్న ఈ స్పాండిలైటిస్ వ్యాధి ఏమిటి.. ఇది ఎందుకు వస్తుంది.. లక్షణాలు ఏమిటి.. ఎంత ప్రమాదకారి మొదలైన విషయాలు తెరపైకి వస్తున్నాయి.

వాస్తవానికి స్పాండిలైటిస్ అనేది మెడదగ్గర గట్టిగా దెబ్బ తగలడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వస్తుందని అంటున్నారు. దీనివల్ల మెడ నుంచి వెన్నుముక వరకూ విపరీతమైన నొప్పి వస్తుందని.. ఈ వ్యాధి మహిళల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. కొన్ని సందర్భంగాల్లో కనీసం మెడను పక్కకు కూడా తిప్పనివ్వదని అంటున్నారు.

ఈ క్రమంలోనే తీవ్రమైన మెడనొప్పి వల్ల తల తిరగడం, కళ్లు తిరిగి పడిపోవడం, నడుస్తున్న సమయంలో ముందుకు తూలిపోతున్నట్లు అనిపించడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. వీటితో పాటు వాంతులు, వికారం వంటివి ఉంటాయని.. చేతులు, కాళ్లు తిమ్మిరులుగా అనిపిస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ వైద్యుల సమక్షంలో విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు.

కాగా... అటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూ.. మరోపక్క ఇప్పటికే ఒప్పుకుని కొంత షూటింగ్ కూడా చేసుకున్న సినిమాలను వీలైనంత త్వరలో ఫినిష్ చేసి, విడుదల చేయాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆమె అటు మానసికంగానే కాకుండా.. ఇటు శారీరకంగానూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.