Begin typing your search above and press return to search.

పవన్ జీ కంటెంట్ చూడండి !

ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే మరో వైపు భోకార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ కులం పేరుతో కాంగ్రెస్ దేశాన్ని విభజిస్తోందని కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   17 Nov 2024 11:30 AM GMT
పవన్ జీ కంటెంట్ చూడండి !
X

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ధాటీగా ప్రసంగాలు చేస్తున్నారు. ఆయన స్పీచ్ అక్కడ అందరికీ ఆకట్టుకుంటోంది. ఒక విధంగా చెప్పాలీ అంటే జోరు చేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో కంటెంట్ ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నారు. ఆయన సనాతన ధర్మం అని ఒకసారి అంటున్నారు. అదే టైం లో మరోసారి ఇంకో మాట మాట్లాడుతూ తన కంటెంట్ తో కాస్తా కన్ ఫ్యూజ్ చేస్తున్నారు అని అంటున్నారు.

ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే మరో వైపు భోకార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ కులం పేరుతో కాంగ్రెస్ దేశాన్ని విభజిస్తోందని కామెంట్స్ చేశారు. కులం రిజర్వేషన్ల పేరుతో దేశాన్ని కాంగ్రెస్ విడగొట్టాలని చూస్తోంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఇక దేశాన్ని ఏకత్రాటి మీద తీసుకుని రాగల సత్తా ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే ఉందని పవన్ చెప్పారు. భారత్ లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్న భేద భావం లేదని కూడా ఆయన అన్నారు. దానికి ఉదాహరణలను చూపిస్తూ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్లు భారత్ లో సూపర్ స్టార్లుగా ఉన్నారని గుర్తు చేశారు.

అలాగే అబ్దుల్ కలాం ని గుండెల్లో పెట్టుకున్న దేశం భారత్ అన్నారు. అటువంటి భారత్ కి కులం పేరుతో రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ విడగొట్టాలని చూస్తోంది అని అన్నారు. అయితే సనాతన ధర్మం అంటూ పవన్ చెబుతున్న దాంట్లోనే కులాల ప్రస్తావన ఉంటుందని అంటున్న వారూ ఉన్నారు.

సనాతన ధర్మం దేశాన్ని వెనక్కి తీసుకుని వెళ్తుందని పాత విధానాల వల్ల దేశం ఇబ్బంది పడుతుందని కూడా వామపక్షాలతో పాటు ఇతర నాయకులు అంటూంటారు. మరి పవన్ సనాతన ధర్మం గురించి ఒక వైపు చెబుతూ కాంగ్రెస్ కులాల పేరుతో చీలుస్తుందని చెప్పడం పట్ల మాత్రం చర్చ సాగుతోంది.

పవన్ ని ఏమైనా అంటే అభిమానులు ఆయన జన సైనికులు బాధపడతారు కానీ ఆయన తన కంటెంట్ విషయంలో మరింత జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటున్న వారూ ఉన్నారు. నిజానికి సనాతన ధర్మమే కులాలకు మూలంగా మారిందని మేధావుల నుంచి అంటున్న మాట. ఆ భావజాలం వల్ల దేశంలో మళ్ళీ వర్ణ వ్యవస్థ మరింత బలోపేతం అయితే అది దేశానికి ఇబ్బందిగా ఉంటుందని కూడా అంటారు.

ఇక కాంగ్రెస్ కులాలను విడదీస్తోందని పవన్ చెప్పడం పట్ల కూడా విమర్శలు ఉన్నాయి. ఈ దేశంలో రిజర్వేషన్లు ఉన్నాయి. కులాలూ ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఆయా కులాలకు దక్కాలని కాంగ్రెస్ అంటోందని చెబుతున్నారు. ఇందులో చీల్చడం అన్న ప్రస్తావన ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనా కుల రహిత సమాజం అంటే అది అభ్యుదయం లాంటిదే అలాంటి దాని కోసం అంతా కృషి చేయాల్సిందే అని మేధావులతో పాటు అందరి మాటగా ఉంటుంది. కానీ సనాతన ధర్మంలో అది సాధ్యపడుతుందా లేదా అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇండియా కూటమి నేతలను ధాటీగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ విధానలను కూడా ఆయన తప్పు పడుతున్నారు.

అదే సమయంలో ఆయన కాంగ్రెస్ దేశాన్ని చీలుస్తోంది అని చేస్తున్న విమర్శల మీదనే చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే ఈ దేశంలో అన్ని మతాలకు తగిన గౌరవం మర్యాద ఇస్తున్నారు అన్నది అంతా అంగీకరించాల్సిందే అని పవన్ ఆ విషయంలో బాగానే చెప్పారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మహారాష్ట్రలో పవన్ స్పీచ్ లో చాలా అంశాలను టచ్ చేసారు. అవి జనాలకు ఎంత మేర ఆకట్టుకుంటాయన్నది చూడాల్సిందే అని అంటున్నారు.