వైసీపీ అంతమే పవన్ పంతం ?
ఏపీలో వైసీపీని పాతాళానికి తొక్కేస్తాను అని నర్సాపురం సభలో పవన్ భారీ స్టేట్మెంట్ ఇచ్చినపుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు.
By: Tupaki Desk | 22 Nov 2024 5:30 AM GMTఏపీలో వైసీపీని పాతాళానికి తొక్కేస్తాను అని నర్సాపురం సభలో పవన్ భారీ స్టేట్మెంట్ ఇచ్చినపుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. అప్పట్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఉంది.
ఇక ఓడినా ఆ పార్టీ బలం దానికి ఉంటుందని అనుకున్నారు. కానె సీన్ కట్ చేస్తే చరిత్రలో ఏ పార్టీకి రాని దారుణ పరాభవం వైసీపీకి దక్కింది. 151 సీట్లు వచ్చింది వైసీపీకే అలాగే 11 సీట్లూ దక్కింది అదే పార్టీకే ఇలా రెండు రికార్డులూ అయిదేళ్ళ తేడాతో క్రియేట్ చేసి ఫ్యాన్ పార్టీ స్విచ్ ఆపు చేసుకుంది.
దానికి కారకుడిగా పవన్ ని అంతా మెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ 11 సీట్లకు తగ్గి ఓడింది కానీ 40 శాతం ఓటు షేర్ ఆ పార్టీకి వచ్చింది. అంతే కాదు రాజ్యసభ లోక్ సభలో మండలిలో ఆ పార్టీ ప్రాతినిధ్యం ఉంది.
ఇక లోకల్ బాడీస్ లో కూడా వైసీపీ గట్టిగా ఉంది. ఆరు నెలల కూటమి పాలన పూర్తి అవుతోంది. వైసీపీ అనుకున్నంతగా ఇబ్బంది పడడం లేదు. ఆ పార్టీ వైపు ఉన్న వారు ఉన్నారు. పైగా కూటమి ఫెయిల్ అయితే తమదే అధికారం అన్న ధీమా వైసీపీలో కనిపిస్తోంది.
దాంతో వైసీపీని 2024 దెబ్బ సరిపోదని మరోసారి గట్టి దెబ్బ తీయాలని కూటమి పెద్దలు ఎటూ ఆలోచిస్తున్నారు. అందులో పవన్ ముందున ఉన్నారని అంటున్నారు. ఏపీలో వైసీపీ రహిత రాజకీయం రావాలని కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నపుడు కోరుకున్నారు. ఏపీకి వైసీపీ హానికరమని ప్రచారం చేశారు.
అటువంటి వైసీపీ ఒక ఎన్నిక తరువాత మళ్లీ పుంజుకుని అధికారంలోకి వస్తే స్ట్రాంగ్ అయిపోతుంది. అందుకే ఆ చాన్స్ ఆ పార్టీకి పవన్ ఇవ్వదలచుకోలేదని అంటున్నారు. అందుకే ఆయన సీఎం సీట్లో చంద్రబాబే ఉంటారని నిండు అసెంబ్లీలో ప్రకటించారని అంటున్నారు
ఆ విధంగా ఆయన ప్రకటించడం ద్వారా జనసైనికుల ఆశలను మొగ్గలోనే తుంచేశారు అని అంటున్నారు. అంటే తనకు ఇప్పట్లో సీఎం పదవి మీద ఆశ లేదని పవన్ చెప్పకనే చెప్పెశారు అని అంటున్నారు. ఏపీలో అభివృద్ధి ఒక ఎత్తు అయితే వైసీపీ రాజకీయంగా ఎలిమినేట్ అవడం మరో అంశంగా ఉందని అంటున్నారు.
అందుకే ఏపీలో వైసీపీని తొక్కిపెట్టి ఉంచాలంటే కూటమితోనే సాధ్యమని పవన్ బలంగా నమ్ముతున్నారు. కూటమిలో లుకలుకలు ఉండకుండా ఉండాలంటే చంద్రబాబు నాయకత్వమే మేలు అన్నట్లుగా తానే మాట్లాడితే ఇక ఆ ఇబ్బందే ఉండదని భావించే ఆయన వ్యూహాత్మకంగా ఈ రకమైన ప్రకటన చేశారు అని అంటున్నారు.
పవన్ అన్న దాని బట్టి చూస్తే చంద్రబాబు మరో పదేళ్ళు కొనసాగాలని అని అంటున్నారు. అంటే 2029 లో ఎన్నికలు కనుక జరిగితే మరోసారి వైసీపీ ఓటమి పాలు అయితే ఇక ఆ పార్టీ తట్టా బుట్టా సర్దుకొవడం ఖాయమని భావించే ఈ విధంగా ప్రకటించారు అని అంటున్నారు. ఆ తరువాత ఏపీలో రాజకీయం జనసేన టీడీపీల మధ్యనే ఉంటుందని ఆయన లెక్క వేస్తున్నారు అని అంటున్నారు.
అయితే పవన్ వైసీపీని పొలిటికల్ గా ఎలిమినేట్ చేయాలన్న ఆలోచన మంచిదే అయినా అదే సమయంలో ఆయనను నమ్ముకున్న క్యాడర్ అలాగే బలమైన సామాజిక వర్గంలో కూడా ఇంతటి కోరిక ఉండాలి కదా అని అంటున్నారు. వారు పవన్ సీఎం అయితే చాలు అని చూస్తున్నారు. ఆ తరువాత సంగతి తరువాత అన్నట్లుగా భావిస్తున్నారు. మరి ఏపీకి వైసీపీ హానికరం అని ఎన్నికల ముందు చెప్పి ఒప్పించిన పవన్ ఇపుడు కూటమి లో అధికారం పంచుకుంటూ విపక్షంలో ఉన్న వైసీపీ అత్యంత ప్రమాదకరం అని ఒప్పించగలగాలి
అలా చేస్తేనే ఏమైనా సాధ్యపడుతుందని అంటున్నారు. అయినా రాజకీయాలో పదవులే ప్రమాణం అనుకునే వారు ఉండే చోట జనసేన ఆలోచనలు అధినాయకత్వం వ్యూహాలకు ఎంతవరకూ మద్దతు దక్కుతుంది అన్నది చర్చగా ఉంది. ఈ ప్రకటన బూమరాంగ్ అయితే తిరిగి వైసీపీకే లాభం అవుతుందన్న మాట కూడా ఉంది. సో పవన్ ఎందుకు ప్రకటన చేశారు అని చర్చించుకునే వారు ఈ వ్యూహం ఉండొచ్చు అని ఊహాగానంగా ప్రచారం చేస్తున్నరు మరి ఇది నిజమా కాదా అన్నది కాలమే చెప్పాల్సి ఉంది.