పవన్ డిసైడ్ అయితే అంతే.. తుపాను వేళ సముద్రంలో 9 మైళ్ల జర్నీ!
కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకొని అక్రమంగా రేషన్ బియ్యాన్ని వేలాది టన్నులు ఎగుమతి చేస్తున్న అంశంపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి.
By: Tupaki Desk | 30 Nov 2024 6:29 AM GMTవెండితెర మీద హీరో డిసైడ్ అయితే.. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. పోరాడేందుకు వెనుకాడరు. రీల్ లో చూపించే సీన్లు రియల్ లైఫ్ లో కనిపించవు. అందునా.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఇలాంటి అంశాల్ని పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ.. పట్టించుకున్నా ఆదేశాలు జారీ చేస్తారే తప్పించి.. లెక్కలు తేల్చేందుకు తమకు తామే రంగంలోకి దిగరు. ఒకవేళ దిగినా.. బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందరిలా చేస్తే ఆయన పవన్ కల్యాణ్ ఎందుకు అవుతారు? తాను ఒకసారి డిసైడ్ అయితే.. తన మాట తానే విననట్లుగా వ్యవహరించిన వైనం చూస్తే.. ఆయనలోని సాహసికుడు మనసును దోచేస్తాడు.
కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకొని అక్రమంగా రేషన్ బియ్యాన్ని వేలాది టన్నులు ఎగుమతి చేస్తున్న అంశంపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ.. దాని గురించి పట్టించుకునే నాథుడే కనిపించడు.ఒకవేళ ఎవరైనా సాహసించినా.. పెద్ద స్థాయిలో ఉన్న పొలిటికల్ ప్రెజర్స్ అంటూ వెనక్కి లాగుతారే కానీ.. ఇష్యూ లెక్క తేల్చే సాహసం చేయరు. ఇలాంటి వేళ.. కాకినాడ పోర్టుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ఇక్కడి అక్రమ బియ్యం ఎగుమతి దందా లెక్క తేల్చేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.
తాను కాకినాడ పోర్టుకు వస్తున్నట్లుగా సమాచారం పంపితే.. పది వేల మందికి సంబంధించి విషయం.. కలుగజేసుకోవద్దన్న మాటతో పాటు.. అధికారులు సహకరించని పరిస్థితి. అంతేనా..రాష్ట్ర డిప్యూటీ సీఎం.. అందునా పవన్ లాంటి అధినేత వస్తుంటే జిల్లా ఎస్పీ సెలవులో వెళ్లిపోవటం మరో ఆసక్తికర పరిణామం. ఇంతా చేసి.. కాకినాడపోర్టుకు పవన్ వచ్చే వేళలో తుపాను వాతావరణం ఉండటంతో.. సముద్రంలోకి వెళ్లటం మంచిది కాదంటూ అధికారులు ఒకటే రీతిలో అడ్డుపుల్లలు వేసే ప్రయత్నం చేశారు.
అయినప్పటికీ.. మరేం ఫర్లేదంటూ అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలోకి ప్రత్యేక బోట్లో.. ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం స్టాక్ ను తనిఖీ చేయటమే కాదు.. షిప్ ను సీజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన వైనం ఇప్పుడు పెను సంచనలంగా మారింది. కాకినాడ యాంకరేజ్ పోర్టులోని ఒక బార్టీలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని తనికీ చేశారు. ఈ సందర్భంగా అధికారుల తీరును తీవ్రంగా తపపు పట్టారు. సినిమాటిక్ గా ఉన్న ఈ సన్నివేశానికి సంబంధించిన పొట్టి వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పటికి.. సాహసంతో తొమ్మిది మైళ్లు ప్రయాణించి.. అక్రమంగా ఎగుమతి అవుతున్న నౌకలోకి వెళ్లి..వేలాది టన్నుల రేషన్ బియ్యాన్ని పరిశీలించి.. సీజ్ కు ఆదేశించారు.
ఇదంతా చూసినప్పుడు.. పవన్ తెగింపు ముచ్చటేస్తుంది. దేశంలో మరే ఉప ముఖ్యమంత్రి కూడా ఈ తరహా సాహసానికి పూనుకోలేదని చెప్పాలి. సినిమాల్లో మాదిరి తానే నేరుగా రంగంలోకి దిగి.. భారీ ఎత్తున సాగుతున్న అక్రమ పీడీఎస్ బియ్యం రాకెట్ ను వెలుగులోకి తీసుకురావటం ద్వారా పవన్ మరో రాజకీయ సంచలనానికి తెర తీశారని చెప్పాలి. అంతేకాద.. తాను తనిఖీలకు వస్తే కేఎస్ పీఎల్ తరఫున అరబిందో సంస్థ సీఈవో కనీసం రాలేదని.. దీన్ని బట్టి ఇక్కడి పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్ సంధించిన కొన్ని ప్రశ్నలు ఇప్పుడు చర్చగా మారాయి. ఇంతవరకు వ్యవస్థలు వీటి మీద ఎందుకు ఫోకస్ చేయలేదన్నది ప్రశ్న. లక్షలాది కేజీల పీడీఎస్ బియ్యం అక్రమ మార్గంలో ఇంత భారీగా అక్రమ పద్దతిలో ఎగుమతి అవుతున్నప్పుడు.. అదే విధంగా గంజాయి.. మాదకద్రవ్యాలు.. ఆయుధాలు అయితే పరిస్థితి ఏమిటి? వెయ్యి లారీలురోజుకు వచ్చే పోర్టులో కేవలం డజను మంది సిబ్బంది ఏమిటి?
కాకినాడ తీర ప్రాంతంలో కేజీ బేసిన్ ఉంది. ఓఎన్ జీసీ లాంటి కంపెనీలు ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి. మారీటైం సెక్యూరిటీ బలహీనంగా ఉండటంతో అక్రమ పద్దతిలో బియ్యం ఎగుమతి అవుతుంది. అదే రీతిలో ఆర్డీఎక్స్ దిగుమతి అయితే? అయినా.. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన కాకినాడ పోర్టు విషయంలో కేంద్ర నిఘా సంస్థలు ఈ అంశాల్ని ఎందుకు పట్టించుకోలేదు? కేంద్రానికి ఎందుకు నివేదిక ఇవ్వలేదు? ఇంత ఆరాచకం జరుగుతున్నా.. ఏమీ పట్టనట్లుగా ఉండటం అంటే.. దీని వెనుకున్న పెద్ద తలకాయల పరిస్థితి ఏంటి? వారెంత పవర్ ఫుల్? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా ఇప్పటివరకు ఎవరికి పట్టని విషయాన్ని.. అందునా దేశ భద్రతకు లింక్ ఉన్న పోర్టు విషయంలో ఇంతటి ఉదాసీనతా? అన్నదిప్పుడు షాకింగ్ గా మారింది. ఏమైనా.. రీల్ హీరో కు ఏ మాత్రం తగ్గని రీతిలో వ్యవహరించిన పవన్ కల్యాణ్.. ఈ ఎపిసోడ్ లో మాత్రం రియల్ హీరోలా వ్యవహరించారని చెప్పక తప్పదు.