పిఠాపురం పర్యటనలో పవన్... ఫ్యాన్స్ మృతి చెందిన ప్రాంతం పరిశీలన!
పిఠాపురం పర్యటనకు వెళ్లిన పవన్ కల్యాణ్.. రాజమండ్రి - పిఠాపురం వెళ్లే మార్గంలోని రామస్వామిపేట వద్ద జరుగుతున్న ఏడీబీ రోడ్డు పనులను పరిశీలించారు.
By: Tupaki Desk | 10 Jan 2025 7:42 AM GMTఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో.. రాజమండ్రి నుంచి పిఠాపురం వెళ్లే మార్గంలో రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన పవన్.. పలు వివరాలు అడిగితెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతను పరిశీలించారు.
అవును... పిఠాపురం పర్యటనకు వెళ్లిన పవన్ కల్యాణ్.. రాజమండ్రి - పిఠాపురం వెళ్లే మార్గంలోని రామస్వామిపేట వద్ద జరుగుతున్న ఏడీబీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా... ఈ నిర్మాణాలను ఎప్పుడు ప్రారంభించారు. పనులు ఎంతవరకూ వచ్చాయి.. తదితర వివరాలను కలెక్టర్ ప్రశాంతిని, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రోడ్డు వెంట కాలినడకన వెళ్లిన పవన్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతను, డ్రెయిన్ సౌకర్యాన్ని పరిశీలించారు.
ఇదే సమయంలో... ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సమయంలో జరిగిన ప్రమాద ప్రాంతాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఇందులో భాగంగా... వడిశలేరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతి చెందగా.. ఆ ప్రమాదానికి గల కారణాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం.
ఇక, ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, పోలీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.