పవన్ యాత్రలకు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు లింక్..!
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం దక్షిణభారత యాత్ర చేస్తున్నారు.
By: Tupaki Desk | 14 Feb 2025 10:55 AM GMTఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం దక్షిణభారత యాత్ర చేస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు దేవాలయాలను ఆయన సందర్శించి.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే.. ఈ హఠాత్పరిణామాలకు.. రాష్ట్రం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు మధ్య ఏమైనా సంబం ధం ఉందా? అనేది ప్రధాన చర్చ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యవహారం దుమ్ము రేపుతోంది. వాస్తవానికి పవన్ కల్యాణ్.. ధర్మ పరిరక్షణ దీక్ష చేయడం.. తిరుమల యాత్ర చేయడం తెలిసిందే.
అయితే.. గతంలో చేసిన వాటికి కొన్ని కారణాలు ఉన్నాయి. తిరుమల లడ్డూ అపవిత్రం అయిందని ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు పవన్ ఈ తరహా దీక్ష, యాత్రచేశారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఆయన దక్షిణ భారత యాత్రను చేస్తున్నారు. దీంతోనే ఇప్పడు ఎమ్మెల్సీ ఎన్నికలకు పవన్ యాత్రకు మధ్య లింకు పెట్టి కథనాలు ,చర్చలు కూడా సాగుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. గత కొన్నాళ్లుగా పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.
అదేసమయంలో రాజకీయంగా ఇబ్బందులు లేకపోయినా.. పార్టీ పరంగా ఆయన కొంత ఇబ్బంది పడు తున్నారు. అనుకున్న విధంగా పార్టీ దూకుడు ప్రదర్శించలేకపోవడం ప్రధాన కారణం. దీనికి తోడు.. నా యకులు కొందరు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, పనులతోనూ పార్టీ ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ యాత్రలు చేయడం కూడా ఆసక్తిగా మారింది. ధర్మ పరిరక్షణ పేరుతో చేసిన దీక్షలు, యాత్రలతో పోల్చితే.. ప్రస్తుతం జరుగుతున్నది సుదీర్ఘయాత్ర.
మరో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ తమిళనాడులోని గుడులను చుట్టేయనున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలు, తన ఆరోగ్యానికి సంబంధించే ఇలా చేస్తున్నారని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే పవన్ ఇలా హిందూ ఓటర్లను ఆకర్సించే ప్రయత్నం చేస్తున్నారని పరిశీ లకులు చెబుతున్నారు. అయితే.. దీనిలో పస ఎంత ఉందన్నది ప్రశ్నార్థకం.
ఎందుకంటే.. కూటమి పార్టీల తరఫునే ఇద్దరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్నా.. వారిద్దరూ టీడీపీ నాయకులే. సో.. వారి కోసం పవన్ ఇంత చేస్తారా? అనేది సందేహం. ఏదేమైనా పవన్ దక్షిణాది యాత్ర మాత్రం సోషల్ మీడియాలోఅనేక చర్చలకు దారి తీస్తుండడం గమనార్హం.