Begin typing your search above and press return to search.

బాబు ముందు మనసు విప్పేసిన పవన్ కళ్యాణ్

ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఏ విషయం అయినా దాచుకోరు.

By:  Tupaki Desk   |   14 Dec 2024 2:19 AM GMT
బాబు ముందు మనసు విప్పేసిన పవన్ కళ్యాణ్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ నటుడు. సున్నిత హృదయం వారికి ఉంటుంది. అంతే కాదు పవన్ వ్యక్తిగతంగా ఎమోషనల్ గా ఎక్కువగా కనిపిస్తారు. దానితో పాటు ముక్కు సూటి తనం కూడా ఉంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఏ విషయం అయినా దాచుకోరు.

తనకు అనిపించినది చెబుతారు. మనసు బయట పెడతారు. ఇదిలా ఉంటే విజయవాడలో జరిగిన స్వర్ణాంధ్ర 1947 విజన్ డాక్యుమెంట్ విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆకాశానికి ఎత్తేశారు.

బాబు గ్రేట్ అన్నారు. తాను మనస్పూర్తిగా చెబుతున్నానని బాబులొ తాను వెన్నుదన్నుగా ఉంటాను అని పవన్ కచ్చితమైన మాట చెప్పారు. తనకు బాబు ఎంతో గౌరవం ఇస్తున్నారు అని తాను కూడా ఆయన గౌరవం తగ్గించే ప్రయత్నం చేయను అని పవన్ అన్నారు. తాము పై స్థాయిలో ఎలా ఉన్నామో చూసి అలాగే టీడీపీ జనసేన నాయకులు కలసి పనిచేయాలని పవన్ కోరడం విశేషం.

చంద్రబాబుకు దేవుడు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని పవన్ కోరుకుంటూనే ఈ కూటమి ప్రభుతం మరో పాతికేళ్ల పాటు కొనసాగాలని కూడా చెప్పుకొచ్చారు. అంతే కాదు చంద్రబాబు వంటి విజనరీ నాయకత్వంలో తాను పనిచేయడం గర్వంగా ఉందని ఆయన అన్నారు.

తనతో పాటు అంతా చంద్రబబు వెన్నంటే ఉన్నామని ఆయన మరోసారి గట్టిగా చెప్పారు. ఇక ప్రజల జీవితాలు బాగుపడాలీ అంటే సరైన సారధ్యం ఏపీకి అందిందే మహానాయకుడు చంద్రబాబు ఉండాలని కూడా పవన్ చెప్పారు.

చంద్రబాబు తన కోసం కలలు కనరని ఏపీలోని ప్రజల కోసం ఆయన కలలు కనే మహా నాయకుడు అని పవన్ కీర్తించడమూ విశేషం. ఇక చంద్రబాబుకు ఉన్న ఓపిక ఆయనకు ఉన్న పట్టుదలను ఎన్ని సార్లు మెచ్చుకున్నా తక్కువే అని పవన్ అన్నారు. రాళ్ళూ గుట్టలలో కూడా మహా నగరాలను చూసిన దార్శనికుడు బాబు అని పవన్ కొనియాడారు. ఆయన వల్లనే సైబరాబాద్ ఏర్పడి ఈ రోజు లక్షలాది మందికి ఉపాధి దొరికిందని ఆయన గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబు విలువ ఏంటో తాను పార్టీ పెట్టి ఇబ్బందులు చూసిన మీదటనే తెలిసి వచ్చిందని అన్నారు. రాజకీయ పార్టీని పెట్టడం అంటే ఆత్మహత్యా సదృశ్యం అని పవన్ అన్నారు. బాబు విజన్ 2020 ఆనాడు తన స్థాయికి అర్థం కాలేదని ఇపుడు విజన్ 2047లో బాబు విజనరీని చూసి గర్విస్తున్నాను అన్నారు.

మొత్తానికి ఎన్నడూ లేని విధంగా బాబుని పవన్ కళ్యాణ్ పొగిడారు. దీనికి ఒక రోజు ముందు కలెక్టర్ల సదస్సులో బాబుని కీర్తించారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలో అయితే బాబు మరో రెండు టెర్ములు సీఎం గా ఉండాలని సభా వేదికగా ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇపుడు చూస్తే ఏకంగా పాతికేళ్ల పాటు ఏపీలో సుస్థిర రాజకీయం ఉండాలని బాబు నిండు నూరేళ్ళూ ఉండాలని పవన్ కోరుకుంటున్నారు అంటే ఆయన ఏకంగా మనసు విప్పి మాట్లాడేశారు అని అంటున్నారు.