Begin typing your search above and press return to search.

నారాయ‌ణ మంత్రం: కీర‌వాణికి.. ప‌వ‌న్ కృత‌జ్ఞ‌త‌లు!

దీనిలో భాగంగానే ఆయ‌న విజ‌య‌వాడ దుర్గమ్మ ఆల‌య మెట్ల‌ను శుద్ధి చేశారు.

By:  Tupaki Desk   |   30 Sep 2024 2:07 PM GMT
నారాయ‌ణ మంత్రం: కీర‌వాణికి.. ప‌వ‌న్ కృత‌జ్ఞ‌త‌లు!
X

సంగీత మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీర‌వాణికి ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దీనికి కార‌ణం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపునిచ్చినా.. `ఓం న‌మో నారాయ‌ణా య‌` మంత్ర జ‌పాన్ని సామాన్యుల‌కు చేరువ చేసేలా కీర‌వాని సంగీతం స‌మకూర్చ‌డ‌మే. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం అప‌విత్రం అయింద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాయ‌శ్చిత్త దీక్ష‌కు దిగిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయ‌న విజ‌య‌వాడ దుర్గమ్మ ఆల‌య మెట్ల‌ను శుద్ధి చేశారు.

ఇక‌, ఈ దీక్ష మంగ‌ళ‌వారంతో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం.. రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు, ప్ర‌జ‌లు కూడా ``ఓం న‌మో నారాయ‌ణాయ`` మంత్రాన్ని జ‌పించాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. దీనిని జ‌న‌సేన పార్టీ సిన్సియ‌ర్‌గా పాటిస్తోంది. ఈ క్ర‌మంలో ``ఓం నమో నారాయణాయ`` మంత్రాన్ని సాధార‌ణ ప్ర‌జ‌లు సైతం సులువుగా పఠించేందుకు వీలుగా సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి 1.19 నిమిషాల నిడివి ఉన్న ఆడియోను స్వ‌చ్ఛందంగా రూపొందించారు.

సాధార‌ణ ప్ర‌జ‌లు సైతం ఉచ్చార‌ణ దోషాలు లేకుండా ఓం న‌మో నారాయ‌ణాయ మంత్ర జ‌పాన్ని చేసేలా ఈ వీడియోను తీర్చిదిద్దారు. సంగీత‌భ‌రితంతోపాటు.. భ‌క్తిభావం కూడా తొణిక‌సలాడేలా ఉన్న ఈ ఆడియో ప‌ట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే కీర‌వాణికి ఆయ‌న కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం ఓ లేఖ‌ను విడుద‌ల చేసింది. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని సాధార‌ణ ప్ర‌జ‌లు సైతం జ‌పించేందుకు వీలుగాగా ఆడియో రికార్డు రూపొందించిన కీరవాణికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ప‌వ‌న్ పేర్కొన్నారు.

అందుకే దీక్ష‌..

ఈ సంద‌ర్భంగా తాను ఎందుకు ప్రాయ‌శ్చిత్త దీక్ష‌ను చేప‌ట్టిందీ ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించారు. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించార‌ని, ఇది కోట్ల మంది శ్రీవారి భ‌క్తుల‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే తాను ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించానని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతోపాటు ధార్మిక విశ్వాసాలు కలిగినవారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్న‌ట్టు చెప్పారు.