సనాతన ధర్మం - కోర్టుల పాత్ర ఏంటి..!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో తలెత్తిన వివాదం.. ఆ తర్వాత పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 7 Oct 2024 7:30 AM GMTసనాతన ధర్మం-కోర్టుల పాత్ర.. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న కీలక చర్చల్లో ఇది కూడా ఒకటి. తాజాగా నేషనల్ పత్రికల్లో ఇదే అంశంపై గత రెండు రోజులుగా వ్యాసాలు, వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం.. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చేసిన సంచలన వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో తలెత్తిన వివాదం.. ఆ తర్వాత పవన్ కల్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ దీక్ష విరమణ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ఆవేశ పూరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టులపై కూడా వ్యాఖ్యలు సంధించిన విషయం తెలిసిందే. మెజారిటీ ప్రజలు అనుసరిస్తున్న సనాతన ధర్మానికి అనుకూలంగా కోర్టులు కూడా నిలబడ డం లేదని పవన్ అన్నారు. కోర్టుల్లో కూడా.. హిందుత్వం, సనాతన ధర్మం అవమానానికి గురి కాబడుతోం దని చెప్పారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ కోర్టులకు కూడా కొన్ని అభ్యర్థనలు చేశారు. ఇదిలావుంటే.. పవన్ వ్యవహా రం వచ్చిన తర్వాత.. నిజంగానే కోర్టులు కూడా ఒకవైపు ఆలోచనే చేస్తున్నాయా? ఒక దిక్కునే అనుకూ లంగా వ్యవహరిస్తున్నాయా? అనే చర్చ జరుగుతోంది. నిజానికి న్యాయవ్యవస్థ పై ఇలాంటి ఆరోపణలు చేసేప్పుడు కొంత సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 32, 142 ప్రకారం.. కోర్టులకు సర్వస్వతంత్రం.. విశేష అధికారాలు ఆపాదించారు.
సరే.. ఇప్పుడు సనాధర్మం విషయంలో కోర్టులు ఎలాంటి పాత్ర పోషించాయో చూద్దాం.. దాదాపు 500 ఏళ్లు గా నలిగిన అయోధ్య రామమందిరం, బాబ్రీమసీదు వ్యవహారంలో గత పదేళ్లలోనే సుప్రీంకోర్టు హిందువు లకు అనుకూలంగా తీర్పు చెప్పిన విషయం ప్రస్తావనార్హం. నిజానికి ఈ కేసు కొన్ని దశాబ్దాలుగా సుప్రీంకో ర్టులో నలుగుతోంది. చివరకు అయోధ్యను అప్పగిస్తూ.. తీర్పు చెప్పింది.
తమిళనాడులోని `రామసేతు` విషయంలో తలెత్తిన వివాదంపైనా సుప్రీంకోర్టు 20 ఏళ్ల కిందటే తీర్పు చెప్పింది. అక్కడ రామసేతు ఉందన్నది వాస్తవమేనన్న ఇస్రో(అమెరికా అంతరిక్ష సంస్థ) నివేదికను కూడా ప్రస్తావించింది. అప్పుడు కూడా సనాతన ధర్మానికే సుప్రీకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కదా!(ఇక్కడ అనుకూలం అనే కంటే.. ఉన్నది ఉన్నట్టుగానే ఇచ్చింది)
మరో కీలక కేసు.. పూరీ జగన్నాథుని రత్నభండారం విషయంలోనూ సుప్రీంకోర్టు సంచలన తీర్పే ఇచ్చింది. తెరిచి తీరాలని ఆదేశించింది. ఇది కూడా మెజారిటీ సనాతనులకు అనుకూలంగానే ఇచ్చింది కదా! అదేసమయంలో తమిళనాడులో ఆలయాల బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఘటనలపై దాఖలైన పిటిషన్లలోనూ సనాతన ధర్మానికే గొడుగు పట్టింది.
అలా వినియోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇలా.. ఎక్కడ ఏ విషయం వచ్చినా.. న్యాయం, చట్టం ప్రకారమే కోర్టులు అనుసరించాయి తప్ప.. ఎక్కడా ఏకపక్షంగా తీర్పులు చెప్పలేదు. కాబట్టి.. కోర్టులను తప్పుబట్టడం ద్వారా మరిన్ని చిక్కుల్లోఇరుక్కోవడమే తప్ప.. మరొకటి కాదు.
కొసమెరుపు ఏంటంటే.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నాయకుడు సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్ వేయనున్నారని తెలిసింది. ఈ సందర్భంగానే ఇవన్నీ.. గుర్తు చేయాల్సి వచ్చింది. మరి న్యాయ పోరాటానికి పవన్ సిద్ధం కాకతప్పదేమో!!