దేవుడు 11 సీట్లకే పరిమితం చేసినా: వైసీపీపై పవన్ హాట్ కామెంట్స్
తక్కువ ధరకే నెయ్యి వస్తోందని కొవ్వు కలిపిన నెయ్యిని కొన్నారని.. ఇది ఎంత దారుణమో అందరూ ఆలోచించుకోవాలన్నారు.
By: Tupaki Desk | 3 Oct 2024 2:21 PM GMT''ఆ దేవదేవుడు కొందరిని 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా. వారికి బుద్ధి రాలేదు. తాము చేయాల్సిం దంతా చేసి.. నెపాన్ని ఎదుటివారిపై నెడుతున్నారు'' అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగా రు. తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీపై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఎక్కడా వైసీపీ పేరు ఎత్తకుండా ఆయన ఏకేశారు. తక్కువ ధరకే నెయ్యి వస్తోందని కొవ్వు కలిపిన నెయ్యిని కొన్నారని.. ఇది ఎంత దారుణమో అందరూ ఆలోచించుకోవాలన్నారు.
ఇంత చేసి కూడా 'కొందరు' కూటమి సర్కారుపై విమర్శలు చేస్తున్నారని, మరికొందరు దీనిని సమర్థిస్తు న్నారని(ప్రకాశ్ రాజ్ వంటివారు) పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయితే.. ఇతర మతాల్లో ఉన్న ఐక్యత హిందువుల్లో లేదని.. అదే తన ఆవేదనగా పేర్కొన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకే తాను దీక్ష చేపట్టినట్టు వివరించా రు. మార్పు ఒక్కరి నుంచే ప్రారంభం అవుతుందని.. అది తన నుంచే ఎందుకు కాకూడదని ప్రశ్నించారు.
కూటమి భేష్
కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని రూపాల్లోనూ మంచి చేస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. కూటమి పార్టీల ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయ్యాయని, ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీల్లో కొన్నింటిని పూర్తి చేసేదిశగా అడుగులు వేసినట్టు తెలిపారు. మిగిలిన హామీలను కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎవరూ అపోహ పడాల్సిన అవసరం లేదని.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు.
ఎన్నికల్లో కూటమి గెలిస్తే ఎలాంటి పగ, ప్రతీకారాలకు తావు ఉండదని చెప్పిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. అదేవిధంగా పాలన చేస్తున్నట్టు వివరించారు. చిన్న చిన్న ఘటనలు జరిగినా.. ఎంతో సంయమ నంతో వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. శాంతి భద్రతలు ప్రధానంగా చూస్తున్నామన్నారు. కేంద్రం నుంచి కూడా సంపూర్ణ సహకారం లభిస్తోందని.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రజలు ధైర్యంగా ఉంటున్నారని పవన్ చెప్పుకొచ్చారు.