బీజేపీ బే ఫికర్: మోడీని సైతం కట్టిపడేసే స్పీచ్
ఇలాంటి సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూపంలో బీజేపీకి తిరుగులేని అస్త్రం దొరికింది.
By: Tupaki Desk | 16 Nov 2024 4:39 PM GMTఇప్పటి వరకు బీజేపీ మహారాష్ట్ర విషయంలో ఒకింత ఆలోచనలో పడిపోయింది. బలమైన నాయకులు ఉన్నా.. ప్రచారం పరుగులు పెట్టడం లేదని.. ప్రజలను ఉత్సాహపరచేలా నాయకులు దూకుడు ప్రద ర్శించడం లేదని చింతన్ శివిర్‌లో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూపంలో బీజేపీకి తిరుగులేని అస్త్రం దొరికింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం అవాక్కయ్యే వాక్చాతుర్యంతో పవన్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు.
ఇతర రాష్ట్రాలకు మహారాష్ట్రకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఎలా ప్రచారం చేసిన పనిచేస్తుంది. కానీ, మహారాష్ట్రకు వచ్చేసరికి అందరూ ఉద్ధండ నాయకులే. ప్రస్తుతం అధికారం కోసం తలపడుతున్న మహాయుతి, మహా వికాస్ అఘాడీ నేతలను పరిశీలిస్తే.. హీనపక్షం 15 నుంచి 20 ఏళ్ల రాజకీయ అనుభవం వారి సొంతం. అంతేకాదు..బ లమైన పోటీ కూడా ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలను తనవైపు తిప్పుకొనేలా.. పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా.. బీజేపీకి మాత్రం నాయకులు ఉన్నా.. అంతర్గత కుమ్ములాటలతోవారు.. ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ వంటిమాటల మాంత్రికుడు.. సమయానికి తగిన విధంగా స్పందించి ప్రచారం చేయడంతోపాటు మహారాష్ట్ర సెంటిమెంటును లేవనెత్త గలిగే నాయకుడి అవసరం కమల నాథులకు అవసరం అయింది. ఖచ్చితంగా ఇలాంటి సమయంలోనే పవన్ కల్యాణ్.. మహా గడ్డపై తనదైన పదునైన వ్యాఖ్యలతో ప్రసంగించడం ద్వారా ఆలోటును తీర్చారనే చెప్పాలి.
తాజాగా శనివారం సాయంత్రం పవన్ కల్యాణ్ డేగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రసంగిస్తూ.. చుర కత్తుల్లాంటి వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. పదునైన సెంటిమెంటు వ్యాఖ్యలతో ప్రచారానికి ఊపు తెచ్చారు. ఆర్టికల్ 370 రద్దు నుంచి ప్రజల సంక్షేమ పథకాల వరకు, స్థానికత నుంచి జాతీయ వాదం వరకు.. అనేక విషయాలను ఏకబిగిన ప్రస్తావించి.. ప్రజలను కమల నాథులవైపు చూసేలా చేశారు. ఈ ప్రచారం తర్వాత.. బీజేపీ ఆశలు మరోసారి పుంజుకున్నాయనే చెప్పాలి. ఆదివారం కూడా.. పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు.