Begin typing your search above and press return to search.

పవన్ వారాహి డిక్లరేషన్ లో ఏముంది?

ఇంతకూ వారాహి డిక్లరేషన్ పేరుతో తిరుపతిలో నిర్వహించే సభలో ఏం చెప్పనున్నారు? ఏయే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నది ఇప్పుడు చర్చగా మారింది

By:  Tupaki Desk   |   3 Oct 2024 4:18 AM GMT
పవన్ వారాహి డిక్లరేషన్ లో ఏముంది?
X

సనాతన ధర్మం గురించి తరచూ మాట్లాడుతున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు (గురువారం) వారాహి డిక్లరేషన్ ను ప్రకటించనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. దీనికి తగ్గట్లు బుధవారం తన తిరుమల దర్శనం వేళలోనూ వారాహి డిక్లరేషన్ కు సంబంధించిన బుక్ ను తనతో ఉంచుకోవటం.. దర్శనానికి తనతో తీసుకెళ్లటం చూస్తుంటే.. శ్రీవారి వద్ద ఆ పుస్తకాన్ని ఉంచినట్లుగా కనిపిస్తోంది. ఇంతకూ వారాహి డిక్లరేషన్ పేరుతో తిరుపతిలో నిర్వహించే సభలో ఏం చెప్పనున్నారు? ఏయే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నది ఇప్పుడు చర్చగా మారింది.

తిరుమలలో స్వామి వారి దర్శనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మీడియాతో కాసేపు మాట్లాడిన పవన్ కల్యాణ్.. సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి సభను అంకితం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకునే లక్షలాది మంది స్వరాలను ప్రతిధ్వనించటమే లక్ష్యంగా వారాహి సభను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

పద్నాలుగు నెలల క్రితం తాను మొదలు పెట్టిన వారాహి యాత్రను కేవలం ఉద్యమంగా ప్రారంభించలేదని.. సమస్యలకు పరిష్కారం చూపించటమే లక్ష్యంగా ప్రారంభించామని చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళలో.. రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ వారాహి ముందుకు కదిలినట్లుగా పేర్కొన్నారు. వారాహి యాత్ర అన్నది ఉన్న యాత్ర మాత్రమే కాదని.. మన రాష్ట్రాన్ని.. మన సంస్క్రతిని కాపాడుకునే నిబద్ధతను సూచిస్తుందని పేర్కొన్నారు. ప్రాచీన సంప్రదాయాలు.. విలువలను పరిరక్షించాలనే నిబద్ధతకు నిదరశ్శనంగా వారాహి సభ ఉంటుందన్నారు.

వారసత్వాన్ని కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరితో కలిసి నడుస్తామన్న పవన్.. సనాతన ధర్మ రక్షణలో భాగంగా అందరిని ఏక తాటి మీదకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. దీనికోసం పలువురు స్వామీజీలు ప్రభుత్వాలకు విన్నపాలు ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. అయితే.. తాజాగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ నుంచి ఈ తరహా డిమాండ్ రావటంతో ఆసక్తి నెలకొంది. మొత్తంగా డిక్లరేషన్ లో ప్రస్తావించే అంశాలు ఎలా ఉంటాయి? ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇస్తారన్న ఉత్కంట పలువురిలో నెలకొందని చెప్పాలి.