Begin typing your search above and press return to search.

చంద్రబాబు పవన్ కలసి ఏపీ అంతటా భారీ సభలు...!

టీడీపీ జనసేన బంధాన్ని మరింతగా క్షేత్ర స్థాయిలో తీసుకుని పోయేందుకు టీడీపీ పక్కా ప్లాన్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   3 Jan 2024 3:39 AM GMT
చంద్రబాబు పవన్ కలసి ఏపీ అంతటా భారీ సభలు...!
X

టీడీపీ జనసేన బంధాన్ని మరింతగా క్షేత్ర స్థాయిలో తీసుకుని పోయేందుకు టీడీపీ పక్కా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా బాబు పవన్ కలసి ఏకంగా ఇరవై రెండు బహిరంగ సభలను ఏపీ అంతటా నిర్వహిస్తున్నారు. అది కూడా ఒకే ఒక నెల జనవరిలోనే నిర్వహించడం విశేషం.

ఈ బహిరంగ సభలకు సంబంధించిన షెడ్యూల్ ని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు రిలీజ్ చేశారు. జనవరి 5వ తేదీ నుంచి 29 వరకూ ఈ సభలు జరుగుతాయి. ఈ సభలకు రా కదలిరా అని పేరు పెడుతూ పోస్టర్లను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ల మీద ఒక వైపు సైకిల్ గుర్తు, మరో వైపు గాజు గ్లాస్ గుర్తు ముద్రించారు. ఈ సభలను పార్లమెంట్ పరిధిలో నిర్వహించనున్నారు. దీని ప్రకారం చూస్తే కనుక గ్రౌండ్ లెవెల్ లో జనసేన టీడీపీ ఒక్కటే అన్న భావన కల్పించడమే కాకుండా కూటమికి పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయడానికి నిర్వహిస్తున్నారు అని అంటున్నారు.

ఇక ఈ నెల 5న ఒంగోలులో మొదటి సభ జరుగుతుంది. అక్కడ కనిగిరిలో సభకు పవన్ చంద్రబాబు హాజరవుతారు. ఆ తరువాత జనవరి 6న విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంటలో, జనవరి 9వ తేదీన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డలలో సభలు జరుగుతాయి. అలాగే జనవరి 10వ తేదీన విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తునిలలో జరుగుతాయి.

ఇక జనవరి 18వ తేదీన ఎన్టీయార్ వర్థంతి నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గుడివాడలో భారీస్థాయిలో సభని నిర్వహించనున్నారు. జనవరి 19వ తేదీన చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని జీడీ నెల్లూరు, కడప పార్లమెంట్ పరిధిలోని కమలాపురంలలో సభకు జరుగుతాయి. అలాగే జనవరి 20వ తేదీన అరకు పార్లమెంట్ పరిధిలోని అరకులో, అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేటలలో సభలను నిర్వహిస్తారు.

ఇక జనవరి 24వ తేదీన రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉవరకొండలో సభలు ఉంటాయని అచ్చెన్నాయుడు ప్రకటించారు. అలాగే జనవరి 25వ తేదీన నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కొవ్వూరు, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని పత్తికొండ అసెంబ్లీలలో సభలు జరుగుతాయి.

అదే విధంగా జనవరి 27వ తేదీన రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం, గుంటూరు పార్లమెంట్ లోని పొన్నూరు అసెంబ్లీలో సభలు నిర్వహిస్తారు. జనవరి 28వ తేదీన అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగుల, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని టెక్కలిలో సభకు జరుపుతారు.

చివరిగా జనవరి 29వ తేదెన ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, బాపట్ల పార్లమెంటు స్థానం పరిధిలో చీరాల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు ఉంటాయి. ఈ సభలతో టీడీపీ జనసేన తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయని అంటున్నారు.