Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్న పవన్...కూటమి ఫిక్స్...!

ఆ మీదట ఆయన ఒక అర్ధరాత్రి చాలా సేపు కేంద్ర హోం మంత్రి బీజేపీ పెద్ద అమిత్ షాని కలిసి చర్చించారు.

By:  Tupaki Desk   |   10 Feb 2024 5:10 PM GMT
ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్న పవన్...కూటమి ఫిక్స్...!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఆయన ఈ నెల 12న కానీ 13న కానీ ఢిల్లీ బయల్దేరుతారు అని అంటున్నారు. ఇంతకు ముందు సంగతేమో కానీ ఈసారి పవన్ ఢిల్లీ టూర్ పొలిటికల్ గా చాలా ఇంటరెస్టింగ్ అని అంటున్నారు. చంద్రబాబు ఈ నెల మొదటి వారం చివరలో ఢిల్లీకి సడెన్ టూర్ పెట్టుకున్నారు.

ఆ మీదట ఆయన ఒక అర్ధరాత్రి చాలా సేపు కేంద్ర హోం మంత్రి బీజేపీ పెద్ద అమిత్ షాని కలిసి చర్చించారు. దాంతో పొత్తులు అన్నీ సెట్ అయిపోయాయని టాక్ నడచింది. ఆ మీదట ఎవరూ ఏ సంగతి బయటకు చెప్పలేదు. అయితే లేటెస్ట్ గా అమిత్ షాయే ఆ విషయం చెప్పారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ నుంచి కొత్త మిత్రులు వస్తున్నారు అని అన్నారు.

దాని అర్ధం టీడీపీ ఎన్డీయే కూటమిలో చేరుతుందనే అంటున్నారు. ఇక చంద్రబాబుతో ఏమి చర్చించారు అన్నది ఇపుడు పవన్ కి వివరించే సీన్ ఉంది. అలాగే పవన్ కూడా బాబుతో పాటు బీజేపీని ఏపీలో కలుపుకుంటే సీట్ల పంపకాలు ఇతరత్రా అంశాలు అన్నీ కూడా బీజేపీ దృష్టికి తెస్తారు అని అంటున్నారు.

అలాగే బీజేపీ కూడా పవన్ తో టీడీపీ తో పొత్తు సీట్ల విషయం అన్నది చర్చిస్తుంది అని అంటున్నారు. ఇక టీడీపీ నుంచి బీజేపీ ఎక్కడ సీట్లు తీసుకోవాలి అన్నది కూడా ఈ రెండు పార్టీల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలా వ్యవహరించాలి. రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలి అన్న దాని మీద బీజేపీతో మాట్లాడుతారు అని అంటున్నారు. జనసేన బీజేపీ ఇప్పటికే మిత్రులు కాబట్టి ఈ రెండు పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేయడం అన్నదాంతో పాటు ఎన్ని సీట్లు అంటే నంబర్ ఎంత అన్నది కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది.

మొత్తం మీద చూస్తే టీడీపీ ఎన్డీయే కూటమిలో కొత్తగా చేరుతున్న పార్టీగా ఉంది. బీజేపీ జనసేన మొదటి నుంచి మిత్రులుగా ఉన్నారు. దాంతో విడిగా మూడు పార్టీలుగా కనిపిస్తున్నా బీజేపీ ప్లస్ జనసేన ఒక వైపు టీడీపీ మరో వైపు ఉంటూ కూటమిలో సీట్లు అయినా మరేదైనా ఎలా పంచుకోవాలన్న దాని మీద చర్చలు ఉంటాయని అంటున్నారు.

పవన్ ఢిల్లీ టూర్ తో ఏపీ పాలిటిక్స్ మరోసారి హీటెక్కనుంది అదే టైంలో ఏపీలో రానున్న రోజుల్లో కూటమి కనుక జట్టు కట్టి ముందుకు వస్తే టోటల్ పాలిటిక్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు.