చంద్రబాబుతో పవన్ భేటీ... తెరపైకి కాంగ్రెస్ - సీపీఐ సీట్ల చర్చ!
ఇందులో భాగంగా తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 6 Dec 2023 9:25 AM GMTతెలంగాణలో ఎన్నికల సందడి ముగిసింది. రేపు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమం కూడా ముగిస్తే ఇక పాలన మొదలవుతుంది. కొత్త ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ ముగిసిన అనంతరం ప్రతిపక్ష బీఆరెస్స్ రంగంలోకి దిగుతుందని చెబుతున్నారు! ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు తెలుగు రాష్ట్రాల దృష్టంతా ఏపీలో జరగబోయే ఎన్నికలపైనే అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ఏపీలో రాజకీయాలపై ప్రజలు దృష్టి సారించారు.
అవును... తెలంగాణలో ఎన్నికల సందడి ముగిసిందో.. లేదో.. ఏపీలో వేడి మొదలుకాబోతుంది. ఇందులో భాగంగా తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కల్యాణ్... చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. ఈ భేటీలో లోకేష్ కూడా ఎంటరయ్యారని తెలుస్తుంది.
తెలంగాణలో అన్యూహ్యంగా చివరి నిమిషంలో టీడీపీ పోటీనుంచి తప్పుకుంది. ఆ త్యాగానికి ఫలితం దక్కిందనే కామెంట్లు తాజాగా వినిపిస్తున్నాయి. మరోపక్క పోటీనుంచి తప్పుకుని టీడీపీ చాలా సేఫ్ అయ్యిందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. లేకపోతే జనసేనతో పోటీపడేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. కారణం... ఈ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీచేసిన జనసేన నోటాతో పోటీపడటమే!
దీంతో... తెలంగాణలో జనసేన సత్తా ఏమిటో తెలిసింది కాబట్టి ఇక పత్తాపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. మరోపక్క ఏపీలో సీట్ల సర్ధుబాటు అంశం అత్యంత కీలకమైన వేళ.. ఈ విషయంపై ఒక ఫైనల్ డెసిషన్ కు కూడా రావాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో నోటాతో పోటీపడటంతో... సీట్ల సర్ధుబాటులో టీడీపీ భీష్మించుకుని కూర్చుంటదా అనే సందేహం జనసేన నేతల్లో ఉందని చెబుతున్నారు.
మొదట్లో ఒక్కో పార్లమెంట్ స్థానానికీ రెండేసి అసెంబ్లీ సీట్లు అంటే... 50 అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేయబోతున్నారని కథనాలొచ్చాయి. తర్వాత కాలంలో ఒక్కో లోక్ సభ స్థానంలోనూ ఒక్కో అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ ఫిక్సయ్యిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో పోటీచేసిన 8 స్థానాల్లోనూ అత్యంత ఘోరంగా ఓడిపోవండంతో... ఇప్పుడు జనసేనకు చంద్రబాబు ఆఫర్ చేయబోయే సీట్లు ఎన్ని అనేది ఆసక్తిగా మారింది.
సరిగ్గా ఈ సమయలో పవన్ కల్యాణ్... చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య తీవ్ర చర్చలు నడుస్తున్నాయని తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా జనసేనకు టీడీపీ ఎన్ని అసెంబ్లీ సీట్లు కేటాయిస్తుందనేదే ఈ భేటీలో కీలక అంశం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. మరోపక్క తెలంగాణ ఎన్నికల్లో మొహమాటాలకు పోకుండా కాంగ్రెస్ పార్టీ సాగించిన పోరాటం.. మిత్రపక్షం సీపీఐకి ఒక్కస్థానం మాత్రమే ఇవ్వడం వంటి అంశాలు కూడా మరికొందరు గుర్తుకు తెస్తున్నారు. దీంతో... ఈ భేటీపై ఆసక్తి నెలకొంది!