Begin typing your search above and press return to search.

జనసేన అధినేత వర్సెస్ ఉప ముఖ్యమంత్రి...పవన్ గురించే చర్చలు !

పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ అని ఉంటుంది. అది ఆయనకు బిరుదు.

By:  Tupaki Desk   |   5 Aug 2024 9:10 AM IST
జనసేన అధినేత వర్సెస్ ఉప ముఖ్యమంత్రి...పవన్ గురించే చర్చలు !
X

పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ అని ఉంటుంది. అది ఆయనకు బిరుదు. రీల్ లైఫ్ లో ఆ బిరుదు ఇచ్చారు. పవన్ అంటే పవర్ అన్నది రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. నిజానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఎంతో పవర్ ఫుల్ గా కనిపించేవారు. 2014 నుంచి 2019 దాకా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆయన బలమైన రెండు ప్రాంతీయ పార్టీలకు ధీటుగా తన రాజకీయాన్ని నడిపించారు.

ఇక 2019లో రెండు చోట్ల ఓటమి పాలు అయి తన పార్టీ కూడా ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయినా పవన్ పవర్ ఎక్కడా తగ్గలేదు. 151 సీట్లు ఉన్న వైసీపీకి ఆయన అయిదేళ్ళ పాటు ఒక ఆట ఆడించారు. ఆయన సభ పెడితే చాలు ఒక వారం పది రోజుల పాటు వైసీపీ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు అంతా విమర్శలు చేసేదిగా ఉండేది.]

అంతలా వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన కదిలించారు. ఆయన స్పీచ్ లో ఆయన కంటెంట్ లో పవర్ అలా ప్రూవ్ చేసుకున్నారు. ఇక అదే పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అధికారమే చేరువైతే ఇక ఆయన ఇంకెలా ఉంటారో అని ఊహించుకున్న వారికి ఒకింత నిరాశ ఎదురవుతోందని అంటున్నారు.

ఈ నెల 12తో ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తి అవుతుంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ ని ఆయన పెర్ఫార్మెన్స్ ని అంతా విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగానే పవర్ ఫుల్ అని కూడా ఒక కంక్లూషన్ కి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీ రాజ్ పర్యావరణం, గ్రామీణ తాగు నీటి సరఫరా, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను చూస్తున్నారు.

అయితే ఆయా శాఖలలో పవన్ మార్క్ అన్నది కనిపిస్తోందా అన్నదే చర్చగా ఉంది. పంచాయతీ రాజ్ శాఖ అంటే చాలా బరువైన శాఖ. ఈ శాఖ పూర్తిగా గ్రామీణ నేపధ్యంతో కూడుకుని ఉన్నది. ఈ శాఖలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ శాఖను ఇంకా అధ్యయనం చేస్తున్నారు అని అంటున్నారు.

అయితే ఆ శాఖ మంత్రిగా ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటనలు అయినా చేస్తే ప్రాక్టికాలిటీస్ కూడా తెలుస్తాయని అంటున్నారు. అలాగే గ్రామీణ తాగు నీటి సరఫరాకు సంబంధించిన అంశాలు కూడా కనిపిస్తాయని అంటున్నారు. ఇక అటవీ శాఖలో ఎర్ర చందనం కీలకమైన సబ్జెక్ట్. అది అక్రమ రవాణా అవుతోంది. ఆ శాఖా మంత్రిగా ఎర్ర చందనం ఉన్న ప్రాంతాలకు వెళ్ళి తనిఖీలు చేయవచ్చు. దాని గురించి జనాలకు కూడా తెలియచేయవచ్చు అని అంటున్నారు.

అదే విధంగా ఎర్ర చందనం దొంగలు స్మగ్లర్లకు కఠినమైన శిక్షలు అమలు చేసేలా చట్టాలలో సవరణలు చేయవచ్చు. అలాగే ఏపీలో జూలు ఉన్నాయి. వాటిని టూరిజం స్పాట్స్ గా కూడా అభివృద్ధి చేస్తే ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. ఇక పర్యావరణానికి సంబంధించి పవన్ మంత్రిగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ శాఖలో ఆకులనే దేవుడి ప్రసాద వితరణకు వాడాలని ఆయన కోరారు.

అయితే ఏపీలో పర్యావరణ హితం కోసం జన చైతన్యం కోసం పవన్ లాంటి పవర్ స్టార్ చెబితే జనాలకు ఎక్కుతుంది. ఆయన ఆ దిశగా వినూత్నమైన చర్యలు చేపట్టవచ్చు. భవిష్యత్తు అంతా పర్యావరణం ముప్పు నుంచి కాపాడుకోవడం మీదనే ఆధారపడి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే పవన్ క్షేత్ర స్థాయి పర్యటనలు ఇంకా ప్రారంభించలేదు. ఆయన సమీక్షలు అన్నీ ఆఫీసు గదులలోనే చేస్తున్నారు.

దాంతో పవన్ ముద్ర ఆయా మంత్రిత్వ శాఖల మీద బలంగా పడాలని కోరుకుంటున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా కూటమిలో చంద్రబాబు తరువాత అంతటి స్థాయి ఉన్న నేతగా పవన్ ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద ఎప్పటికపుడు స్పందించాలని కూడా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా పవన్ ఉప ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలతో ఒకింత సైలెంట్ అయ్యారని అంటున్నారు. పవన్ గురించి ఇపుడు అదే చర్చగా సాగుతోంది. చూడాలి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో. రానున్న రోజులలో అది ఏ విధంగా అమలు చేస్తారో కూడా చూడాల్సి ఉంది.