Begin typing your search above and press return to search.

టీడీపీ తో సీట్ల పంపకాల విషయంలో భార్గైనింగ్ పవర్ పోగొట్టుకున్న పవన్ ?

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక వరుసగా రెండు పర్యాయాలు అధికారాన్ని అనుభవించిన తెలంగాణ రాష్ట్ర సమితికి మూడోసారి ఎదురుదెబ్బ తప్పలేదు.

By:  Tupaki Desk   |   4 Dec 2023 4:06 AM GMT
టీడీపీ తో సీట్ల పంపకాల విషయంలో భార్గైనింగ్ పవర్ పోగొట్టుకున్న పవన్ ?
X

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక వరుసగా రెండు పర్యాయాలు అధికారాన్ని అనుభవించిన తెలంగాణ రాష్ట్ర సమితికి మూడోసారి ఎదురుదెబ్బ తప్పలేదు. అయితే ఆ పార్టీ మరీ ఘోర పరాభవమైతే చవి చూడలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది కాబట్టి ఆ పార్టీ ఫుల్ హ్యాపీ. గత ఎన్నికల్లో పోలిస్తే బీజీపీ ఎంతో మెరుగుపడింది. సీట్లు, ఓట్లు పెరిగాయి. వాళ్లు కూడా కొంత సంతోషంగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పోటీలోనే లేదు, ఆ పార్టీ మద్దతుదారులు కోరుకున్నట్లే రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నాడు కాబట్టి వాళ్లు ఖుషినే. ఎటొచ్చీ జనసేన పరిస్థితే ఇబ్బందికరంగా ఉంది. ఈ ఎన్నికల్లో అత్యంత ఘోరమైన ఫలితాలు ఎదుర్కొంది ఆ పార్టీనే.

పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. చాలా చోట్ల నోటాతో పోటీ పడాల్సిన పరిస్థితి. అవసరం లేని చోట పార్టీ పోటీకి దిగి అవమాన భారం ఎదుర్కోవాల్సి వచ్చిందని జనసేన మద్దతుదారులు బాధపడుతున్నారు. పొత్తు ధర్మం పాటిస్తూ బిజెపి కోసం ఎన్నికల్లో పోటీ చేశామని చెప్పుకుందాం అనుకున్నా.. ఆ పార్టీ వాళ్లు ఎక్కడా కూడా జనసేన అభ్యర్థులకు అండగా నిలవలేదు అన్నది ఎన్నికల్లో స్పష్టంగా తెలిసిపోయింది. జనసేనకు ఘోరమైన ఫలితాలు రావడంతో దీన్ని ఏపీ అధికార పార్టీ వైసీపీ అనుకూలంగా మలుచుకుని తమను ఎగతాళి చేస్తారని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక ఏపీలో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీతో సీట్ల పంపకాల విషయంలో భార్గైనింగ్ పవర్ కూడా కొంతమేర కోల్పోయామని వారు బాధపడుతున్నారు. అసలు తెలంగాణ ఎన్నికల్లో పార్టీని బరిలోకి నిలిపి పవన్ ఏం సాధించారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. రాంబాబు తెలుగుదేశం లాగే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే అన్ని రకాలుగా మంచి జరిగేదని.. ఈ ఫలితాలను ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళమని.. కానీ ఇప్పుడు అవసరంలేని అవమానభారాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని.. ఇది ఏపీ ఎన్నికల్లో కూడా కొంతమేర ఇబ్బందిగా మారుతుందని జనసేన మద్దతుదారులు ఆవేదన చెందుతున్నారు.