వైసీపీ ఓటు బ్యాంక్ మీద కన్నేసిన పవన్ !?
మరో అయిదేళ్ళ పాటు పార్టీని నడిపించే శక్తియుక్తులు దానికి తగిన వయసు అనుభవం అంగబలం అర్ధ బలం అన్నీ జగన్ కి ఉన్నా ఆయనకు అవకాశాలు అలా ఉంటాయా అన్నదే చర్చ.
By: Tupaki Desk | 21 May 2024 2:30 AM GMTఏపీలో జూన్ 4 తరువాత రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతాయి. ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీల మధ్య సమతుల్యత లో కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈసారి ఎన్నికల్లో అధికార వైసీపీ ఓటమి పాలు అయితే ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మరో అయిదేళ్ళ పాటు పార్టీని నడిపించే శక్తియుక్తులు దానికి తగిన వయసు అనుభవం అంగబలం అర్ధ బలం అన్నీ జగన్ కి ఉన్నా ఆయనకు అవకాశాలు అలా ఉంటాయా అన్నదే చర్చ.
జగన్ మీద కేసులను వేగవంతం చేసి ఆయనను జైలుకు పంపాలని ఏపీలో ఉన్న టీడీపీ కూటమి ప్రయత్నం చేస్తుంది అని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే దశాబ్దాల పాటుగా జగన్ మీద కేసులు కోర్టులలో విచారణ దశలో ఉన్నాయి. రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల మీద ఉన్న కేసులను సత్వరమే విచారించి తీర్పులు వెలువరించాలని అత్యున్నత న్యాయ స్థానం కూడా గతంలోనే ఆదేశాలు ఇచ్చింది.
ఈ క్రమంలో ఏపీలోనూ కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయితే పొలిటికల్ వాక్యూమ్ కోసం బీజేపీ జనసేన తప్పకుండా చూస్తాయని అంటున్నారు. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నా కూడా జనసేన బీజేపీ ఆలోచనలు రెండవ పక్షంగా తాము ఎమర్జ్ కావాలన్నదే అని అంటున్నారు.
అందులో భాగంగానే గతంలో టీడీపీని దెబ్బతీయాలని బీజేపీ చూసింది అని అంటున్నారు. అయితే బీజేపీ మిత్రుడు పవన్ మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకుని కూటమిలోకి బీజేపీని రప్పించగలిగారు. దాంతో ఇపుడు టీడీపీ కొంత బలోపేతం అయింది. రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కనుక మరింత కాలం ఆ పార్టీ మనుగడకు ఎలాంటి ఢోకా ఉండబోదు అని అంటున్నారు.
మరి విపక్షంలోకి కనుక వైసీపీ వస్తే అపుడు పరిస్థితి ఏంటి అంటే పవన్ తో పాటు బీజేపీ కూడా వైసీపీనే ఇబ్బంది పెట్టడం ద్వారా ఆ పార్టీని తగ్గించాలని చూస్తారు అని అంటున్నారు. తద్వారా వైసీపీ ఎంత వీక్ అయితే అంతలా తాము ఆ ప్లేస్ లోకి వెళ్ళేందుకు చూస్తారు అని అంటున్నారు. అయితే ఏపీలో చూస్తే వైసీపీ ఓటు బ్యాంక్ కంప్లీట్ గా బీజేపీకి వ్యతిరేకమైనది అని అంటున్నారు.
ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎపుడూ బీజేపీకి సపోర్ట్ గా ఉండరని కూడా ప్రచారంలో ఉంది. ఇక వీరితో పాటు బలమైన రెడ్డి సామాజిక వర్గం కూడా వైసీపీతోనే ఉంటున్నారు. రేపటి రోజున వైసీపీ ఓటమి పాలు అయి రాజకీయంగా ఇబ్బందులు వస్తే కనుక వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారు అని అంటున్నారు.
ఆ విధంగా ఏపీ మరచిపోయిన కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలు మెరుగు అవుతాయని అంటున్నారు. అయితే జనసేన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వైసీపీ వీక్ అయితే ఆ ప్లేస్ లో తాము బలమైన ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందవచ్చు అని. దాంతోనే ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు.
రేపటి ఎన్నికల తరువాత టీడీపీ కూటమి కనుక పవర్ లోకి వస్తే మాత్రం వైసీపీకి ఇబ్బందులు తప్పవనే అంటున్నారు. అయితే వైసీపీ వర్గాల కధనం అయితే ఇవన్నీ ఊహాగానాలే అని అంటున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు. ఒకవేళ పొరపాటు జరిగి తాము విపక్షంలోకి వచ్చినా మరో అయిదేళ్ల పాటు టీడీపీ కూటమితో ధీటుగా పోరాడి మళ్ళీ అధికారం సాధించుకునే సత్తా తమకూ తమ నాయకత్వానికీ ఉందని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే వైసీపీ ని నిర్వీర్యం చేయడం ద్వారా ఆ ప్లేస్ లోకి వెళ్లాలని చూస్తున్న పవన్ ఆశలు ఏ మేరకు నెరవేరతాయన్నది చూడాలని అంటున్నారు. దాని కంటే ముందు ఏపీలో రేపటి రోజున కూటమి అధికారంలోకి వస్తుందా లేక వైసీపీ వస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.