Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ అట్టాంటిది మరి!

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   6 April 2024 5:17 AM GMT
పవన్  కళ్యాణ్  ఇమేజ్  అట్టాంటిది మరి!
X

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. అసెంబ్లీలో తనలాంటి వ్యక్తి ఉండాలని చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నారు! ఈ క్రమంలో పిఠాపురం అయితే అన్ని విధలా సేఫ్ అని భావించారని చెబుతున్నారు. ఈ సమయంలో తాను పిఠాపురంలోనే నివాసం ఉంటానని చెబుతున్న పవన్... ఆ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలుస్తుంది!

అవును.. రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పవన్ కల్యాణ్... ఇకపై తన శాస్వత చిరునామా పిఠాపురమే అని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాజాగా ఒక ఇంటికి పవన్ అద్దెకు తీసుకున్నారు! ఇందులో భాగంగా... పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం, చేబ్రోలులో ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది మూడంతస్తుల నూతన గృహం!

చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న తన పొంటపొలాల్లో ఓదూరి నాగేశ్వర రావు అనే రైతు మూడంతస్తుల భవనాన్ని నిర్మించుకుంటున్నారు. ఈ భవనం అయితే పవన్ కు అన్నిరకాలుగా కంఫర్ట్ గా ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో... దీన్నే ఎంపిక చేశారు! ఈ క్రమంలో... ఉగాది పర్వదినాన్న ఈ ఇంట్లోకి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని తెలుస్తుంది. ఈ ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశం ఇటీవలే పూరయ్యింది.

జనసేన అధినేత పవన్ ని అమితంగా అభిమానించే నాగేశ్వర రావు... తన ఇంటిని పవన్ కు అద్దెకు ఇచ్చేందుకు అంగీకరించారంట. మూడంతస్తుల ఈ ఇల్లు అయితే నివాసానికి, పార్టీ సమావేశలకు, చుట్టు ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండటం వల్ల కార్ల పార్కింగ్ కు అన్నింటికీ సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారంట. ఇదే సమయంలో ఇంటికి దగ్గర్లోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేసేందుకూ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది.

కొత్త ఇళ్లు.. చుట్టూ సువిశాల ప్రదేశం.. పవన్ కు అన్ని రకాలుగానూ కంఫర్ట్ అయ్యే వాతావరణం.. ఇలా పిఠాపురంలో పవన్ కు నాగేశ్వర రావు నివాసం రూపంలో మంచి ఆశ్రయం దొరికిందని అంటున్నారు! ఇంతకూ ఈ ఇంటి అద్దె ఎంతంటారా..? ఒక్క రూపాయి మాత్రమే అద్దె ఇవ్వమని.. అంతకు మించి వద్దు అని నాగేశ్వర్ చెప్పినట్లు సమాచారం!!