మిత్రధర్మమా? రాజధర్మమా? పవన్‌కు పెద్ద సంకటం?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పెద్ద గురుతర బాధ్యతలో ఉన్నారు.
By: Tupaki Desk | 23 Jun 2024 1:30 PM GMTడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పెద్ద గురుతర బాధ్యతలో ఉన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నా.. ఆయన కంటే కూడా..ఇప్పుడు ఎక్కువగా అందరూ చూసేది.. అందరూ పరీక్షగా పరిశీలించేది పవన్ కల్యాణ్‌నే. ఈ విషయంలో సందేహం లేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కంటే.. పవన్ కల్యాణ్ డిప్యూటీసీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు.. కొన్ని వేల మంది ఎక్కువగా వీక్షించారు. అలానే చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన ప్పుడు వీక్షించిన వారికంటే ఓ రెండు వేల మంది పవన్ మాట్లాడినప్పుడు ఎక్కువగా వీక్షించారు.
ఇలా.. ఎటు చూసినా.. పవన్ కార్నర్‌గా ప్రజలు ఎక్కువగా పరిశీలన చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు సభను పాలనను ఒక అర్థవంతమైన గాడిలో పెడతానని చెప్పుకొచ్చారు. తాను సభలోకి వెళ్లినా.. ప్రభుత్వంలోకి వచ్చినా.. పాలన ఎలా ఉంటుందో చూపించి తీరుతానన్నారు. ఇది ఆయనకు హైప్ పెంచేసింది. అయితే.. రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. రానురాను.. ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయంటూ.. పెద్ద ఎత్తున ఆందోళనలు తెరమీదికి వచ్చాయి.
ఇక, కేసులు.. దాడులతో పల్నాడు.. అనంతపురం వంటివి కూడా.. అట్టుడుకుతున్నాయి. ప్రధాన చానెళ్లు వీటిని బాయ్ కాట్ చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటికీ.. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలవుతూ నే ఉంది. ఇవన్నీ.. జరుగుతున్న క్రమంలో ఇప్పటికే.. కొందరు.. వైసీపీ నాయకులు పవన్ సెంట్రిక్‌గా కామెంట్లు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. వంగల పూడి అనిత, అచ్చెన్నాయుడు వంటివారు.. చేసిన వ్యాఖ్యలు కూడా.. దుమారం రేపాయి.
నిజానికి వీటిపై ఎవరైనా ప్రశ్నించాల్సి వస్తే.. సీఎం చంద్రబాబును ప్రశ్నించాలి. కానీ, పవన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆయనేమో.. మౌనం పాటిస్తున్నారు. దీనికికారణం.. పొత్తు ధర్మం. తన పార్టీ నాయకులు కాదు కాబట్టి.. పొత్తు పార్టీ నాయకులు కాబట్టి.. వారేచూసుకుంటారన్న భావన కావొచ్చు. కానీ, రాజధర్మానికి వస్తే.. సీఎం తర్వాత.. సీఎం స్థానంలో ఉన్నారు కాబట్టి.. ఆయన స్పందించి తీరాలి. లేదా.. వాటిని కట్టడి చేయాలి. మొదటిది చేస్తే.. విమర్శలు ఎదుర్కొనాలి. అంటే.. మౌనంగా ఉంటే.. ఇబ్బందులు. అలాగని రాజధర్మం పాటిస్తే.. కూటమిలో ఇబ్బందులు. సో.. ఎలా చూసుకున్నా..పవన్ ఒక సంకట స్థితిని తొలి రోజుల్లోనే ఎదుర్కొంటున్నారు. మరి మున్ముందు ఎలాంటి పరిస్థితి ఆయనకు ఎదురవుతుందో చూడాలి.